అక్కినేని హీరోతో పెళ్లి… ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన మీనాక్షి చౌదరి!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు మధ్య ఎన్నో రకాల రూమర్లు వినపడుతూ ఉంటాయి.
అయితే ఈ రూమర్స్ శృతిమించి రావడంతో సెలబ్రిటీలు స్పందిస్తూ ఆ రూమర్లకు చెక్ పెడుతూ ఉంటారు.
ఇకపోతే గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది.హీరోయిన్ గా మీనాక్షి చౌదరి( Meenakshi Chowdary ) ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నా ఈమె త్వరలోనే విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా నటించిన మెకానిక్ రాకీ( Mechanic Rakhi ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
"""/" /
ఇక విశ్వక్ మెకానిక్ రాఖీ సినిమా ఈనెల 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీనాక్షి చౌదరి తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
గత కొంతకాలంగా అక్కినేని సుశాంత్( Akkineni Sushanth ) ను ఈమె పెళ్లి( Marriage ) చేసుకోబోతున్నారని అక్కినేని ఇంటి కోడలుగా మీనాక్షి చౌదరి అడుగు పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
"""/" /
ఈ వార్తల గురించి ఈమె స్పందిస్తూ.నేను కూడా ఈ వార్తలను విన్నానని తెలిపారు.
ఈ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను కానీ నాకు ఇలాంటి వార్తలు క్రమక్రమంగా అలవాటు పడుతున్నాయని తెలిపారు.
ఇటీవల కాలంలో ప్రతిరోజు నా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
ఇక నా పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ వార్తలు పూర్తిగా ఆవాస్తవమంటూ ఖండించారు.
ఇలా అక్కినేని హీరోని ఈమె పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలపై స్పందించి క్లారిటీ రావడంతో ఇక ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.
పుష్ప 2 టార్గెట్ ను రీచ్ అవుతుందా..?