నా జీవితమే ఒక బ్లెస్సింగ్, నేను దేవుడి బిడ్డని: మీనాక్షి చౌదరి..
TeluguStop.com
మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం.
ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనములు నిలుపరాదు, కిలాడీ, హిట్: ది సెకండ్ కేసు, గుంటూరు కారం సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది.
ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి "లక్కీ భాస్కర్",( Lucky Baskhar ) విశ్వక్ సేన్‌తో కలిసి "మెకానిక్ రాకీ",( Mechanic Rocky ) వరుణ్ తేజ్ తో కలిసి "మట్కా"( Matka ) సినిమాలు చేస్తోంది.
ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం.ఫాంటసీ యాక్షన్ ఫిలిం విశ్వంభరలో ఒక ఫిమేల్ లీడ్‌గా కూడా కనిపించనుంది.
మొత్తం మీద నాలుగు తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.ఈ నేపథ్యంలోనే మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ అందాల తార హర్యానాలోని పంచకులలో జన్మించింది.ఆమె తండ్రి B.
R చౌదరి భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేశారు.మీనాక్షి చండీగఢ్‌లోని స్కూలింగ్ పూర్తి చేసింది.
ఆ సమయంలోనే స్టేట్ లెవెల్ స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచి ఆశ్చర్యపరిచింది.పంజాబ్‌లోని ఓ హాస్పిటల్‌లో డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
అలా డాక్టర్ కూడా అయ్యింది. """/" /
డాక్టర్ అయిన తర్వాత ఆమె అందాల పోటీల్లో పాల్గొన్నది.
ఫెమినా మిస్ హర్యానా 2018( Femina Miss Haryana 2018 ) టైటిల్ నెగ్గింది.
మిగతా ప్రతిష్టాత్మకమైన అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది.తర్వాత ఒక చిన్న వెబ్ సిరీస్ లో నటించింది.
2019లో అప్ స్టార్ట్స్ అనే ఒక హిందీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది.
2021లో తెలుగు సినిమా "ఇచట వాహనములు నిలుపరాదు"తో హీరోయిన్‌గా మారింది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది.
"""/" /
ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి డాక్టర్ అయ్యానని, తర్వాత అందాల పోటీల్లో పాల్గొన్నానని, అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని, వీటిలో దేనికి ఒక దానికి ఒకటి లింకు లేదని కానీ తనకు అన్నీ కలిసి వచ్చాయని చెప్పుకొచ్చింది.
"నా జీవితం ఒక బ్లెస్సింగ్, రోజూ నిద్ర లేవగానే నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా.
మా గ్రాండ్ మదర్ ఎప్పుడూ నేను ఒక దేవుడు బిడ్డని అని చెబుతూ ఉంటుంది.
నేను జీవించడం, మరుసటి రోజు కొత్త ఆసక్తికరమైన విషయాలను ట్రై చేయడం జరుగుతోంది.
ఇంతకంటే నాకేం కావాలి." అని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చింది.
వావ్.. ఇది కదా అసలైన రోహిత్ శర్మ.. హృదయాలను గెలుచుకున్నాడుగా