హీరోయిన్ సంఘవితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన మీనా.. వీడియో వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ ని ప్రారంభించిన మీనా ఆ తర్వాత నవయుగం సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ఆమె తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.సినిమా ఇండస్ట్రీలో కొంతకాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది మీనా.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం,మలయాళం,హిందీ,కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించింది. """/"/ అయితే నటి మీనా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విద్యాసాగర్ ను 2009లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దంపతులకు ఒక పాప కూడా ఉంది.కాగా మీనా భర్త విద్యాసాగర్ గత ఏడాది పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇక భర్త మరణించిన తర్వాత కొంతకాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది మీనా.

ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటోంది.అంతేకాకుండా ఇదివరకటి లాగే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది.

"""/"/ ఇది ఇలా ఉంటే తాజాగా మీనా సీనియర్ నటి సంఘవితో కలిసి హీరో విశాల్ నటించిన ఎనిమీ మూవీలో టమ్ టమ్ పాటకు సంఘవితో కలిసి మీనా అదిరిపోయే స్టేప్పులు వేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో సంఘవి కంటే స్టెప్పులను మరింత బాగా వేస్తూ నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది మీనా.

ఆ వీడియో చూసిన నెటిజెన్స్ అభిమానులు మీనాపై కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

ఇకపోతే భర్త చనిపోక ముందు వరకు మీనా పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్న మీనా మళ్ళి సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం తమిళంలో రౌడీ బేబీ మూవీ, మలయాళంలో జనమ్మ డేవిడ్ సినిమాలో నటిస్తోంది.

వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి