100 కోట్ల కలెక్షన్స్ కొల్ల కొడుతున్న మీడియం రేంజ్ హీరోలు వీరే !
TeluguStop.com
ఇటీవల కాలంలో 100 కోట్ల కలెక్షన్స్ అంటే స్టార్ హీరోలకు పెద్ద మ్యాటర్ ఏమీ కాదు.
టాక్ కొంచెం బాగా ఉందంటే చాలు ఆటోమాటిక్ గా 100 కోట్లు వచ్చేసినట్టే.
అయితే మీడియమ్ రేంజ్ హీరోలు ఇలా 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం అనేది మాత్రం మామూలు విషయం కాదు ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించిన ఘనత కేవలం ఎనిమిది మంది హీరోలకు మాత్రమే దక్కింది.
గతంలో చాలామంది హీరోలు రెండు మూడు కోట్ల బడ్జెట్ తోనే 100 కోట్లు సాధించిన చరిత్ర ఉంది అని అనుకుంటే పొరపాటే అది ఇటీవల కాలంలో సాధ్యమయ్యే పనికాదు బ్రహ్మాండమైన విజయం సాధించిన బేబీ లాంటి చిత్రాలకు మాత్రమే ఇది పరిమితం.
మరి సాధారణ బడ్జెట్ తో సినిమాలు తీసి వంద కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన 8 మంది హీరోలు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
"""/" /
ఇటీవల కాలంలో 100 కోట్లకు క్లబ్లో జాయిన్ అయ్యాడు సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ).
డీజే టిల్లు స్క్వేర్ మంచి విజయాన్ని అందుకుని 100 క్రోర్స్ నాట్ అవుట్ దిశగా పరిగెడుతు ఉంది.
సిద్దు కన్నా ముందు ఈ క్లబ్ లో చేరిన మరో హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ).
హనుమాన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఈ హీరో గుర్తింపు దక్కించుకోవడంతో పాటు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి మొట్టమొదటి సారి 100 కోట్లు దాటాడు.
తేజ సజ్జా కి హనుమాన్ చిత్రం ద్వారా తక్కిన మరొక గుర్తింపు ఏంటి అంటే బాహుబలి సినిమా తర్వాత ఏకంగా 100 కోట్లకు పైగా లాభాలు దక్కించుకున్న చిత్రం హనుమాన్ మాత్రమే.
"""/" /
ఇక ధమాకా సినిమాతో రవితేజ ( Ravi Teja )ఈ లిస్టులో చాలా లేటుగా జాయిన్ అయ్యాడు.
రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్న ఈ మీడియం రేంజ్ ధమాకా తర్వాతే 100 కోట్ల క్లబ్లో చేరాడు.
ఇక కార్తికేయ సీక్వెల్ సినిమాతో నిఖిల్( Nikhil ) కూడా మొట్టమొదటిసారి 100 కోట్లు కొల్లగొట్టాడు.
ఉప్పెన సినిమాతో తన డెబ్ల్యూ చిత్రంలోని వైష్ణవ తేజ్( Vaishnava Tej ) కూడా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డులు దక్కించుకోవడం విశేషం.
మరో మీడియం రేంజ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ ( Varun Tej )సైతం ఎఫ్2 తో ఈ క్లబ్ లోనే చేరగా గీతగోవిందం చిత్రంతో మొదటిసారి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) కూడా 100 కోట్ల కొల్లగొట్టిన కథ ఓపెన్ చేశాడు.
ఇక నాని కూడా దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో ఉన్నాడు.
అమ్మ బాబోయ్.. ఉడత గాల్లో ఎగరడం ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!