మేడిపల్లి బీఆర్ఎస్ పార్టీకి షాక్
TeluguStop.com
కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగిల్ విండో చైర్మన్,తాజా మాజీ సర్పంచ్ లు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లోని మేడిపల్లి,బీమారం మండలల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.
బీమారం సింగిల్ విండో చైర్మన్ కానుగంటి శ్రీనివాస్, మేడిపల్లి మండలం వల్లంపల్లి తాజా మాజీ సర్పంచ్ వెల్మ సమత-నవీన్ రెడ్డి,కాచారం మాజీ సర్పంచ్ కొప్పెర జలందర్ రెడ్డి లు వారి అనుచరులతో సోమవారం ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
జై బాలయ్య అంటూ రియాక్ట్ అయిన పూనమ్.. త్రివిక్రమ్ కు మాత్రం మరో షాకిచ్చిందిగా!