ముత్యాల్లాంటి అక్షరాలతో మందుల చీటి.. డాక్టరుపై ప్రశంసలు
TeluguStop.com
పిల్లల్లో ఎవరిదైనా హ్యాండ్ రైటింగ్ బాగోలేకపోతే ఖచ్చితంగా డాక్టర్ అవుతాడని సరదాగా జోకులు వేస్తారు.
హ్యాండ్ రైటింగ్ గజిబిజిగా రాయడంలో డాక్టర్లకు ప్రత్యేక శైలి ఉంటుంది.వారి రాసినది సామాన్యులకు అస్సలు అర్ధం కాదు.
అయితే కేవలం ఫార్మాసిస్టులు మాత్రమే దానిని అర్ధం చేసుకోగలరు.ఎంత బుర్ర గోక్కున్నా సామాన్యులు మాత్రం డాక్టరు రాసిన మందుల చీటిని అర్ధం చేసుకోలేరు.
అందుకే డాక్టరు-ఫార్మాసిస్టు మధ్య బంధంపై చాలా జోకులు వస్తుంటాయి.ఇక డాక్టరు రాసే మందుల చీటి అందరికీ అర్ధం అయ్యేలా ఉండాలని సుప్రీం కోర్టు సైతం తీర్పు ఇచ్చింది.
అయినప్పటికీ చాలా మంది డాక్టర్లు ఇప్పటికీ పాత తరహాలోనే మందుల చీటి రాస్తున్నారు.
గజిబిజిగా ఎవరికీ అర్ధం కాకుండా వారి రాత ఉంటుంది.అయితే ఓ డాక్టరు రాసిన మందుల చీటి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.కేరళలోని పాలక్కడ్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నితిన్ నారాయణ్ అనే వ్యక్తి డాక్టరు(పీడియాట్రీషియన్)గా పని చేస్తున్నారు.
ఆయన వద్దకు వచ్చి వెళ్తున్న రోగులు ఆశ్చర్యపోతున్నారు.మందుల చీటిలో ఆయన హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా ఉంటోంది.
పైగా కాస్త చదువు వచ్చిన వారు ఎవరైనా దానిని సులువుగా అర్ధం చేసుకునేలా మందుల చీటిని ఆయన రాస్తున్నారు.
దీనిని చూసిన వారంతా డాక్టరు చేతి రాతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.ప్రస్తుత రోజుల్లో డాక్టర్ల హ్యాండ్ రైటింగ్ ఎవరికీ అర్ధం కాకుండా ఉంటోంది.
"""/" / అది కేవలం ఫార్మాసిస్టులకు మాత్రమే అర్ధం అయ్యే తరహాలో పిచ్చి పిచ్చిగా ఉంటుంది.
దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం చాలా మంది డాక్టర్లు విస్మరిస్తున్నారు.అయితే డాక్టర్ నితిన్ నారాయణ్ మాత్రం అందుకు విరుద్ధం.
తన రాత సామాన్యులకు సైతం సులువుగా అర్ధమయ్యేలా, ముత్యాల్లాంటి అక్షరాలతో ఆయన మందుల చీటి రాస్తున్నారు.
అందరికీ అర్ధం కావాలని తాను మందుల చీటిని క్యాపిటల్ అక్షరాలలో రాస్తానని ఆయన చెప్పారు.
ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మనిషివా.. మోహన్ బాబువా.. అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఆగ్రహం.. పోస్ట్ వైరల్