ఏ గ్రహ దోషం ఉన్నవారు ఎటువంటి ఔషధ స్నానం చేయాలో తెలుసా?

సాధారణంగా మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు వారి జీవితంలో ఏదో ఒక దోషాలు కలుగుతూనే వుంటాయి.

ముఖ్యంగా గ్రహ దోషాలు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు.కొందరిలో పుట్టుకతోనే గ్రహాల స్థితి ప్రభావం ఏర్పడితే మరికొందరిలో కాలం గడుస్తున్న కొద్దీ గ్రహ మార్పు వల్ల ఇంకా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

అందుకే పరిస్థితులు బాగా లేనివారు గ్రహ దోషాల కోసం పరిహారాలు చేస్తుంటారు.కొంతమంది గ్రహ శాంతి నివారణ కోసం హోమాలు చేయగా, మరికొందరు దానధర్మాలను చేస్తుంటారు.

ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు పరిహారం చెల్లించుకుంటారు.అయితే గ్రహ దోషాలున్న వారు ఔషధ స్నానం ఆచరించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

అయితే ఏ గ్రహ దోషం ఉన్నవారు ఏ విధమైనటువంటి ఔషధ స్నానాలు చేయడం వల్ల పరిహారం లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

సూర్య గ్రహ దోషం: యాలకులు, దేవదారు, కుంకుమ పువ్వు, వట్టివేళ్ళు, యష్టిమధుకం, ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు ఈ వస్తువులు నీళ్ళూ వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయడం వల్ల సూర్య గ్రహ దోషానికి పరిహారం లభిస్తుంది.

చంద్ర గ్రహ దోషం: """/" / గోమూత్రం, ఆవు పాలు పెరుగు పేడ, ఆవు నెయ్యి, శంఖాలు, మంచిగంధం, స్పటికం వంటి వస్తువులను నీళ్లలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చంద్ర గ్రహ దోషం తొలగిపోతుంది.

కుజగ్రహ దోషం: """/" / మారేడు ,ఎర్రచందనం, ఎర్ర పువ్వులు నీళ్లలో వేసి ఆ నీటిని కాంచీ స్నానం చేయాలి.

బుధ గ్రహ దోషం: """/" / ఆవు పేడ, తక్కువ పరిమాణంలో గోరోజనం, పండ్లు తేనె వంటి వస్తువులను నీటిలో కాచి ఆ నీటితో స్నానం చేయాలి.

గురు గ్రహ దోషం: """/" / తెల్ల ఆవాలు, మాలతి పుష్పాలు, తేనె కలిపిన నీటిని కాచి ఆ నీటితో స్నానం చేయాలి.

శుక్ర గ్రహ దోషం: """/" / యాలకులు, మణిశిల,శౌవర్చ లవణం, కుంకుమ పువ్వు ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి.

శని గ్రహ దోషం: """/" / నల్ల నువ్వులు, సుర్మరాయి, సాంబ్రాణి, ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి.

వైరల్ వీడియో: దేవుడా ఎంత పెద్ద జీవిని ఎరగా మింగేసిన కింగ్ కోబ్రా.. చివరకి..