ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాలలో మెడికల్ క్యాంప్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దుమాల గ్రామములోని ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాల, హాస్టల్ విద్యార్థులకు శుక్రవారం మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్ తెలిపారు.
హాస్టల్ లోని 133 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులను పంపిణి చేయడం జరిగిందన్నారు.
దీనిలో భాగంగా రక్త పరీక్షల కొరకు 18 మంది విద్యార్థులను సిహెచ్ సి ఎల్లారెడ్డిపేట కు పంపించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమములో మండల వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్, హెల్త్ అసిస్టెంట్ బాబు, ఏఎన్ఎం లు కమల, భూలక్ష్మి,శ్యామల, శారద, సుమలత లు పాల్గొన్నారు.
మరో అనారోగ్య సమస్యకు గురైన సమంత… ఎమోషనల్ పోస్ట్ వైరల్!