నోరు జారిన కేటీఆర్.. ట్రోల్ అవుతున్న వీడియో!

సాధరణంగా పార్టీలోని కీలక నేతలు ఎప్పుడో ఒకసారి మాత్రమే ప్రెస్‌మీట్‌లో ప్రసంగిస్తారు.టీవీ చర్చల్లో కూడా అరుదుగా కనిపిస్తుంటారు.

  ఇక మీడియాతో మాట్లాడటానికి అధికార ప్రతినిధులు,  ఎమ్మెల్యేలు ఉంటారు.మొన్న టివి9లో టీవీ డిబేట్‌కు రజనీకాంత్‌తో కలిసి మంత్రి కె తారక రామారావు హాజరయ్యారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గెలుపుపై దీమా వ్యక్తం చేసిన కేటీఆర్ ఆత్మవిశ్వాసంతో బీజేపీపై నిప్పులు చెరిగారు.

కేటీఆర్ తనదైన శైలిలో మాటల తూటలు పేల్చారు .అయితే ఈ టీవీ చర్చను చూసిన వారికి మాత్రం పాజీటివ్ సంకేతాలు ఇవ్వలేదు.

టీఆర్‌ఎస్‌ జోరు మీదున్నదని, ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని వ్యూహాలు పన్నుతున్నదనే దానిపై నెగిటివ్‌ వైబ్‌ ఇచ్చింది.

అలాగే, తెలంగాణ పోలీసులు ఓటుకు నోటు కుంభకోణంలో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన తర్వాత  కేటీఆర్ ఈ డిబెట్‌లో పాల్గొన్నారు.

సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పైచేయి సాధించాలి.ఈ చర్చకు హాజరుకావడం ద్వారా కేటీఆర్ తప్పుడు సంకేతం ఇచ్చినట్లుగా అనిపించింది.

రజినికాంత్ అడిగిన ప్రశ్నలను కేటీఆర్ అంతా పాజీటివ్ మాట్లాడలేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

"""/"/ అలాగే ఈడీ బోడీ అంటూ చేసిన వ్యాఖ్యలు ట్రొల్ అవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా ఇవ్వదని, టీఆర్‌ఎస్ చార్జిషీట్ బీజేపీ మేధో దివాళాకోరుతనాన్ని బట్టబయలు చేస్తుందన్నారు.

 మునుగోడుకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే విస్మరించినందున అభివృద్ధిలో వెనుకబడిన అంశాలు ఉండేలా మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి పూర్తి చేస్తామన్నారు.

 కేంద్ర మంత్రి అమిత్‌ షా పాదరక్షలను మోసిన సంజయ్‌ అదే చేతులతో ప్రమాణం చేయడంతో యాదాద్రి దేవాలయం ‘అపవిత్రం’ అయిందన్నారు.