Sai Pallavi : సాయి పల్లవిని అభినందించడానికి మీడియాకు కారణాలు కావాలి.. కవర్లూ కావాలి…

టాలీవుడ్ అభిమానులు సాయి పల్లవిని( Sai Pallavi ) గంజాయి తోటలో తులసి మొక్కగా అభివర్ణిస్తుంటారు.

ఎందుకంటే సాయి పల్లవి మిగతా హీరోయిన్లకు చాలా భిన్నం.ఆమెది డబ్బు కోసం కక్కుర్తి పడే వ్యక్తిత్వం కానే కాదు.

కోట్ల రూపాయల ఆఫర్లు కాళ్ల ముందుకు వస్తున్నా టెంప్ట్ కాకుండా వాటిని తన్ని తరిమేసే గొప్ప హీరోయిన్ సాయి పల్లవి.

తనకు నచ్చనిది, అభిమానులకు చెడు చేసేది ఏదైనా సరే ఆమె ఈజీగా వదులుకుంటుంది.

అందుకే ఇప్పటివరకు ఏ హీరోయిన్‌కి రాని లేడీ పవర్ స్టార్ బిరుదు ఆమెకు వచ్చింది.

అలాగే పవర్ స్టార్ రేంజ్‌లో ప్రేమాభిమానం లభిస్తోంది. """/" / అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో నటించిన గార్గి,( Gargi ) విరాటపర్వం సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి.

దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి.ఈ సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత సాయి పల్లవి క్రమంగా హైదరాబాద్‌కు రావడం మానేసింది.

తెలుగు మీడియా కూడా ఆమెను పట్టించుకోవడం లేదు.మామూలుగా హీరోయిన్లకు అవకాశాలు వచ్చి వారి చేతికి డబ్బు కవర్లు అందితేనే మీడియా వారి వైపు చూస్తుంది.

అసలు కవర్లే అందకపోతే వారిని కన్నెత్తేనా చూడదు.సాయి పల్లవి విషయంలోనూ ఇదే జరుగుతోంది.

అభినందించడానికి ఏదైనా కారణం ఉంటే తప్ప మీడియా సాయి పల్లవి గురించి వార్తలు రాయడం లేదు.

ఇప్పుడు సాయి పల్లవిని అభినందించడానికి ఓ కారణం దొరికేయడంతో మీడియా ఆమెపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

సంగతేంటంటే, సాయి పల్లవి రీసెంట్ గా 60 ఏళ్ల వయసు ఉన్న తన తల్లిదండ్రులతో కలిసి అమర్నాథ్ యాత్ర ( Amarnath Yatra )విజయవంతంగా పూర్తి చేసింది.

ఇది దేవుడిని చూడాలని చేసే యాత్ర మాత్రమే కాదు.సంకల్ప శక్తీ, ధైర్యం, ఓర్పు వంటి లక్షణాలను యాత్రికులు సొంతంగా పరీక్షించుకునే ఒక యాత్ర.

ఈ విషయాలను సొంత అనుభవంతో తెలుసుకున్నానని సాయి పల్లవి తెలిపింది.ఈ యాత్రలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని కానీ విల్ పవర్ తో వాటన్నిటిజీ అధిగమించాలని పేర్కొంది.

"""/" / సాయి పల్లవి ఆ అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో సహా పంచుకుంది.

ఎంతో కష్టమైన ఈ యాత్రలో ఓం నమశ్శివాయ అంటూ యాత్రికులు ముందుకు సాగుతారని తెలిపింది.

నిజానికి సాయి పల్లవి యాక్టింగ్‌లోనే కాదు డాన్స్ లో కూడా ఆమెకు ఆమె సాటి.

ఆమెను ఎంత అభినందించినా తక్కువే.కారణాలు వెతుక్కుని మరీ ప్రశంసించాల్సిన అవసరం లేదు.

మీడియా ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది.

బీవీఎస్ రవి డైరెక్షన్ లో రవితేజ సినిమా చేయబోతున్నాడా..?