మెదక్ కస్టోడియల్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ

మెదక్ కస్టోడియల్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఖదీర్ ఖాన్ మృతిని గతంలో హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

చైన్ స్నాచింగ్ కేసులో ఖదీర్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే అదే సమయంలో ఖదీర్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 16న గాంధీ ఆస్పత్రిలో ఖదీర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

కాగా ఖదీర్ మృతి కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించగా ఇందులో ప్రతివాదులుగా డీజీపీ, మెదక్ ఎస్పీ, హోం శాఖ కార్యదర్శి, మెదక్ సీఐ ఉన్నారు.

కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

వీడియో: పురిటి నొప్పుల్లో ఉన్న జీబ్రాపై మగ జీబ్రా అరాచకం.. కళ్లముందే బిడ్డను చంపేసింది!