ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన మన తెలంగాణలోని చర్చి..

కరుణామయుడు దివ్య కోవెల, నమ్మిన భక్తులకు అండగా ఉంటూ ఆసియా ఖండంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న చర్చి మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ చర్చి.

కరుణామయుని జన్మను పురస్కరించుకొని క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకతను సంతరించుకొని విదేశాల నుంచి సైతం పర్యాటకులను ఆకర్షిస్తున్న మెదక్ చర్చి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మెదక్ జిల్లాలో గల దక్షిణ భారత సంఘం చే నిర్వహింపబడుతున్న చరిత్రక కట్టడం ఈ చర్చి.

దాదాపు 100 ఏళ్ల నాటి కట్టడానికి, నాటి నిర్మాణాశాలిని ఈ చర్చి కట్టడాన్ని చూసే తెలిసిపోతుంది.

లండన్ కు చెందిన పాశ్నేట్ అనే మత గురువు మెదక్ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో, అనారోగ్యాలతో, ఆకలితో ఉండగా తన వంతు సాయం చేయడానికి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు.

చర్చి నిర్మాణం కోసం అప్పుడు పనికి ఆహార పథకం లాంటి దానిని ప్రవేశపెట్టి ఈ నిర్మాణంలో అందరూ పనిచేసేలా చేశారు.

1914లో మొదలైన ఈ చర్చ్ దాదాపు 12 వేల మంది కార్మికులు 10 సంవత్సరాలు కష్టపడి 1924లో చర్చి నిర్మాణం పూర్తి చేశారు.

మెదక్ నగరంలోని ఈ సుప్రసిద్ధ చర్చ్ అతి సుందర కట్టడం గా పేరుగాంచి ఉంది.

ఈ చర్చి నిర్మించేటప్పుడు ఇటలీ దేశస్తులతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగా నిపుణులు చర్చి నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

200 అడుగుల పొడవు 100 అడుగుల వెడల్పుతో నిర్మించబడిన ఈ చర్చికి 175 అడుగుల ఎత్తున శిఖరం ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఒక కళాఖండం పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థన మందిరాన్ని శిఖరాన్ని నిర్మించడం అప్పటి మన పూర్వీకుల పనితనం గురించి తెలుసుకోవచ్చు.

"""/"/ ఇంకా చెప్పాలంటే ఈ చర్చిలోని అద్దాలపై ఏసుక్రీస్తుకు సంబంధించిన జననా వృత్తాంతం మొదులుకొని, ఆయన శిలువ అయి తిరిగి లేచింతవరకు జరిగిన సంఘటనలు అన్నీ ముద్రించబడ్డాయి.

అంతేకాకుండా కేవలం సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు మాత్రమే ఆ అద్దాలపై చిత్రాలు ఏర్పడడం విశేషం.

మిగిలిన సమయాలలో ఎంత ప్రయత్నించినా ఈ చిత్రలు ఎవరికీ కనబడవు.ఒకేసారి 5000 మంది ప్రజలు ప్రార్థన చేసుకునే అవకాశం ఈ మందిరంలో ఉంది.

అతను లేకపోతే సుకుమార్ అనేవాడు ఇండస్ట్రీలోనే లేడు… ఎమోషనల్ అయిన డైరెక్టర్?