ఆ అనుమానంతో... ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన టీడీపీ !

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనే అనుమానంతో .రాజంపేట టిడిపి శాసనసభ్యుడు,ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.

నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశం అయిన సందర్భంగా టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే.టిడిపి నేతల సమావేశానికి తనను అహ్వానించలేదని ఇంతకుముందు మల్లిఖార్జున రె్డ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే మేడా పార్టీని వీడినంత మాత్రాన తమకు పెద్దగా జరిగే నష్టం ఏమీ లేదని టిడిపి ఎంపీ సి.

ఎమ్.రమేష్ అన్నారు.

కాగా.ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మేడ కలవబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.