వంకాయ పంటను ఎండు తెగుళ్ల బెడద నుండి సంరక్షించే చర్యలు..!

వంకాయ పంటను( Eggplant Crop ) దీర్ఘకాలిక పంటగా, స్వల్పకాలిక పంటగా సాగు చేయవచ్చు.

చీడపీడల, తెగుళ్ల బెడద తక్కువగా ఉంటేనే వంకాయను దీర్ఘకాలిక పంటగా సాగు చేయాలి.

నేలలో పోషకాలు సంపూర్ణంగా ఉంటేనే వంకాయ సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

వంకాయ పంటను సాగు చేసే నేలను లోతు దుక్కులు దున్నుకున్న తర్వాత నేల వదులుగా అయ్యేలాగా దమ్ము చేసుకోవాలి.

అప్పుడే మొక్క వేర్లు సులువుగా నేలలోకి చోచ్చుకుపోయి బలంగా తయారవుతాయి.ఇక ఒక ఎకరం పొలానికి 8 టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ) , 25 కిలోల బాస్వరం, 25 కిలోల పొటాష్ ఎరువులు అందించాలి.

"""/" / తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.

నారు పెంచేందుకు పెద్దపెద్ద నారుమడులను ఏర్పాటు చేసుకోవాలి.లేదంటే నర్సరీలలో దొరికే ఆరోగ్యకరమైన నారును ఎంపిక చేసుకొని ప్రధాన పొలంలో నాటుకొని సాగు చేపట్టాలి.

వంకాయ పంటకు డ్రిప్ పద్ధతి ( Drip Method )ద్వారా నీటిని అందించాలి.

మల్చింగ్ కవర్ ను పరచడం వల్ల కలుపు సమస్య పెద్దగా ఉండదు. """/" / వంకాయ పంటకు ఎండు తెగుళ్లు సోకితే దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.

ఈ ఎండు తెగుళ్లు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి.

పొలంలో ఏరా పంటగా సాలుల మధ్య బంతి మొక్కలు నాటుకోవాలి.ఎండు తెగుళ్లు సోకిన నేలలో పంట మార్పిడి పద్ధతి పాటించాలి.

అంటే క్యాబేజీ పంటను సాగు చేయడం వల్ల ఎండు తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.

కాబట్టి రైతులు ఏ పంటను సాగుచేసిన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి పద్ధతి పాటించడం వల్ల వివిధ రకాల తెగుళ్ల, చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది.

ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ విషయంలో ట్విస్ట్ ఇదే!