పత్తి పంటను ఆశించే గులాబీ రంగు కాయ తొలుచు పురుగుల నివారణకు చర్యలు..!
TeluguStop.com
పత్తి పంటకు మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.అందుకే పత్తిని తెల్ల బంగారం అని అంటారు.
పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడ( Pest ) పీడలలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ పురుగులను గుర్తించి తొలిదశలో అరికడితేనే పంట సంరక్షించబడుతుంది.కాబట్టి ఈ పురుగులను గుర్తించడానికి పంటపై ప్రత్యేకంగా ఉంచాలి.
"""/" /
పంటలో ఈ కాయ తొలుచు పురుగులను ఎలా గుర్తించాలంటే.పువ్వులను గమనించినప్పుడు అందులో గుడ్డిపూలు( Eggplants ) ఉన్నట్లయితే వాటికి ఈ పురుగులు ఆశించినట్టే.
కాయ పై భాగంలో గుండ్రటి చిన్న రంధ్రం, కాయ తొనల మధ్య గోడలపై గుండ్రటి రంద్రం, గుడ్డి పత్తి మరియు రంగు మారిన పత్తి పంట పొలంలో కనిపిస్తే ఈ గులాబీ రంగు కాయ తోలుచు పురుగులు పంటను ఆశించినట్లు నిర్ధారించుకోవాలి.
సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించి తొలి దశలోనే నివారించే ప్రయత్నం చేయాలి.సేంద్రియ ఎరువులు( Organic Fertilizers ) మరియు నత్రజని ఎరువుల( Nitrogen Fertilizers ) సమతుల్యత పాటించి ఈ పురుగుల ఉధృతిని తగ్గించాలి.
"""/" /
పత్తి పంట విత్తిన 45 రోజుల తర్వాత ఈ పురుగులు పంటను ఆశించే అవకాశం ఉంది.
కాబట్టి ఒక ఎకరం పొలంలో నాలుగు లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేయాలి.ఆ బుట్టలలో పురుగులు పడడం గమనించినట్లయితే వెంటనే సస్యరక్షక చర్యలు చేపట్టాలి.
ఈ పురుగుల నివారణకు రసాయన పిచికారి మందులైన క్వినాల్ఫాస్ 25 ఇసి.2.
0మి.లీ ను ఒక లీటర్ నీటిలో కలిపి పత్తి మొక్క ఆకులు, కొమ్మలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
లేదంటే క్లోరిపైరిఫాస్ 20 ఇసి.2.
5 మి.లీ ను లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలిపత్తి పంట ఆఖరి దశలో ఉన్నప్పుడు బైఫెన్ త్రిన్( Bifen Trin ) 10 ఇసి.
లీ ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు పిచికారి చేయాలి.
వైరల్ వీడియో: రాజకీయ నేతపై చీపురుతో దాడి చేసిన మహిళలు