కంది సాగులో వెర్రి తెగులను నివారించేందుకు చర్యలు..!
TeluguStop.com
తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పప్పు దినుసులలో కంది( Pigeon Pea ) ప్రధానమైనది.
కందిని అధికంగా వర్షాధార పంటగా సాగు చేస్తారు.ఎటువంటి నేలలోనైనా ఈ కంది పంటను సాగు చేయవచ్చు.
అయితే నీరు నిల్వ ఉండని నేలలు కంది పంట సాగుకు అనుకూలం అని చెప్పవచ్చు.
ఇక నల్ల రేగడి నేలలలో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.అధిక వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా కంది సాగుకు చీడపీడల బెడద, వివిధ రకాల తెగుళ్ల బెడద ఉంటుంది.
కాబట్టి అధిక వర్షాలు కురుస్తున్నప్పుడు వర్షపు నీరు నేలలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేటట్లు జాగ్రత్తలు చేయాలి.
వాతావరణం లో మార్పులు సంభవించినప్పుడు పంటలు గమనించి ఏమైనా చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశించాయేమో గుర్తించాలి.
"""/" /
కంది పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో ప్రధానంగా వెర్రి తెగులుగా చెప్పుకోవచ్చు.
కాబట్టి పంటను గమనిస్తూ తొలి దశలోనే ఈ వెర్రి తెగులను నివారించాలి.కంది పంటను ఆశించే వెర్రి తెగులను స్టెరిలిటీ మొజాయిక్( Sterility Mosaic ) తెగులు అని అంటారు.
వాతావరణం లో కాస్త మార్పు జరిగిన ఈ వెర్రి తెగులు పంటలు ఆశిస్తాయి.
ఈ తెగులు సోకితే కంది పంటకు పూత వచ్చే అవకాశం ఉండదు.కంది పంట వేసిన నెలలోపు ఈ తెగులు సోకితే 90 శాతానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
"""/" /
కంది మొక్క ఆకులపై ముదురు ఆకుపచ్చ బుడగల వంటి నిర్మాణాలు కనిపిస్తే వెర్రి తెగులు సోకినట్టే.
ఈ తెగులు సోకిన ఆకులు ముడుచుకుపోయినట్లు చిన్నగా మారతాయి.ఈ తెగుల నివారణకు ఒక లీటరు నీటిలో కరిగే గంధపు పొడి కలిపి పిచికారి చేయాలి.
లేదంటే ఒక లీటరు నీటిలో నాలుగు మిల్లీలీటర్ల డైకోఫోల్ ను కలిపి పంటవేసిన నెల రోజులకు పిచికారి చేస్తే ఈ తెగుల బెడద ఉండదు.
పంట వేసిన రెండు నెలల తర్వాత ప్రాపర్ గైట్ 57% EC రెండు మిల్లీలీటర్లను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి ఈ తెగులను అరికడితే కంది పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు.
ఆ ట్రోల్స్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లాను.. మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు వైరల్!