ఫోన్ చార్జ‌ర్ల‌పై ఈ 6 సింబ‌ల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..?

చార్జింగ్ అయిపోతుందంటే చాలు, చార్జ‌ర్ తీసి ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకోవ‌డం ప‌రిపాటే.డివైస్ చార్జింగ్ లేనప్పుడు ఎవ‌రైనా అలాగే చేస్తారు.

అయితే మీకు తెలుసా.? మీరు వాడే ఏ కంపెనీకి చెందిన చార్జ‌ర్‌పైనైనా కొన్ని సింబ‌ల్స్ ఉంటాయి.

గ‌మ‌నించారా.? అవును, అవే.

అయితే ఆ సింబ‌ల్స్‌, అక్ష‌రాలు ఎందుకు ఉంటాయో, అవి వేటిని సూచిస్తాయో మీకు తెలుసా.

? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.h3CE చిహ్నం.

/h3 ఏ మొబైల్ చార్జ‌ర్‌పైనైనా చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా మొత్తం 6 సింబ‌ల్స్ ఉంటాయి.

వాటిలో మొద‌టిది CE అనే చిహ్నం.ఇది ఎందుకు చార్జ‌ర్స్‌పై ఉంటుందంటే.

Conformité Européenne అనే ఓ సంస్థ ఉంటుంది.దీనికి European Conformity అనే అర్థం వ‌స్తుంది.

ఈ సంస్థ నిర్దేశించిన ప్ర‌మాణాల మేర‌కు స‌ద‌రు చార్జ‌ర్ త‌యారు చేయ‌బ‌డింది అని అర్థం.

అందుకే CE అనే సింబ‌ల్ చార్జ‌ర్స్‌పై ఉంటుంది.h3డ‌స్ట్‌బిన్ గుర్తు.

/h3 ఇత‌ర వ‌స్తువుల్లా స్మార్ట్‌ఫోన్ చార్జ‌ర్స్‌ను డ‌స్ట్‌బిన్‌లో ప‌డేయ‌రాదు.ఎందుకంటే అవి ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు క‌దా.

అవి ప‌నిచేయ‌ని ప‌క్షంలో వాటిని ప్ర‌త్యేకంగా ఎల‌క్ట్రానిక్ వేస్ట్‌ను తీసుకెళ్లే వారికి ఇవ్వాలి.

అంతే కానీ ఇత‌ర చెత్త‌తో చార్జ‌ర్స్‌ను డ‌స్ట్‌బిన్‌ల‌లో ప‌డేయ‌కూడ‌దు.h3హౌస్ సింబ‌ల్‌.

/h3 చార్జ‌ర్ల‌పై మ‌నకు క‌నిపించే ఇంకో గుర్తు హౌస్ సింబ‌ల్‌.ఇది ఎందుకు ఉంటుందంటే.

స‌ద‌రు చార్జ‌ర్‌ను కేవ‌లం ఇంట్లో (ఇండోర్ లో) మాత్ర‌మే వాడాల‌ని అర్థం.అంటే.

విద్యుత్ బాగా తీసుకునే హెవీ లోడ్ ప‌రిక‌రాల‌కు వీటిని క‌నెక్ట్ చేయ‌కూడ‌ద‌ని అర్థం.

అందుకే హోమ్ సింబ‌ల్ ఉంటుంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3చతుర‌స్రాకారంలో ఉండే రెండు బాక్సులు.

/h3 చార్జ‌ర్ల‌పై మ‌న‌కు చతుర‌స్రాకారంలో ఉండే రెండు బాక్సులు క‌నిపిస్తాయి.ఈ సింబ‌ల్ ఎందుకు ముద్రిస్తారంటే స‌ద‌రు చార్జ‌ర్ స‌రిగ్గా ఇన్సులేష‌న్ చేయ‌బ‌డింద‌ని, అది సేఫ్ అయిన విద్యుత్ ప‌రిక‌రం అని అర్థం.

అవును, విద్యుత్ పరికరాల నుంచి మ‌న‌కు సేఫ్టీకి గాను ఇన్సులేష‌న్ చేస్తారు.అది తప్ప‌నిస‌రి.

ఈ క్ర‌మంలో చార్జ‌ర్ల‌కు కూడా ఇన్సులేష‌న్ ఉంటుంది.అందుకే దాన్ని సూచించే విధంగా బాక్సులు వేస్తారు.

H3పీసీటీ లోగో./h3 యూరో ఏషియ‌న్ కౌన్సిల్ మార్గ నిర్దేశ‌కాల ప్ర‌కారం GOST R (gosudarstvennyy Standart In Russian) అనే సంస్థ పెట్టిన ప్ర‌మాణాల‌కు అనుగుణంగా, టెక్నిక‌ల్‌గా ఆ చార్జ‌ర్ త‌యారు చేయ‌బ‌డింద‌ని అర్థం.

అందుకే దాన్ని సూచించే విధంగా పీసీటీ లోగోను ముద్రిస్తారు.h3V సింబ‌ల్‌.

/h3 ఇది దేశ దేశానికి మారుతూ ఉంటుంది.ఎందుకంటే ఆయా దేశాల్లో ప్ర‌జ‌ల‌కు అందే విద్యుత్ వోల్టేజీ మారుతూ ఉంటుంది క‌దా, అందుకు అనుగుణంగా దానికి త‌గిన చార్జ‌ర్ అని సూచించేందుకు గాను ఆ సింబ‌ల్ వేస్తారు.

అమెరికా, కెన‌డాల్లో IV సింబ‌ల్ ఉంటుంది.అదే ఆసియా, యూర‌ప్‌ల‌లో V సింబ‌ల్ ఉంటుంది.

బాలకృష్ణ, రవితేజ కాంబినేషన్ లో మిస్ అయిన క్రేజీ సినిమా ఏదో మీకు తెలుసా?