Akira Nandan : వామ్మో అకీరా ఆధ్యా పేర్ల వెనుక ఇంత అర్థం ఉందా?
TeluguStop.com
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.
ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన నటి రేణు దేశాయి( Renu Desai ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి బద్రి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడినటువంటి ఈ జంట అనంతరం పెళ్లి చేసుకున్నారు.
ఇక ఈ దంపతులకు అకిరా ఆధ్యా అనే ఇద్దరు సంతానం కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఇక పిల్లలు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ మధ్య మనస్పర్ధలు రావడం ఇద్దరు విడాకులు తీసుకోండి విడిపోవడం జరిగింది.
ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం మరొక వివాహం చేసుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా ఉన్నటువంటి రేణు దేశాయ్ సినిమాలకు కూడా దూరమయ్యారు.
ఇక ఈమె చాలా రోజుల తర్వాత రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు ( Tiger Nageswararao ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
"""/" /
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటి రేణు దేశాయ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
ఈ ఇంటర్వ్యూల సందర్భంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా తన పిల్లల గురించి పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎన్నో విషయాలను మాట్లాడారు అయితే తన పిల్లల పేర్లు గురించి ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిల్లల పేర్లు మనకు అకిరా ఆధ్యాగా మాత్రమే తెలుసు.
కానీ వీరీ అసలు పేర్లు ఏంటి అనే విషయానికి వస్తే అబ్బాయి పేరు అఖీరా నందన్( Akira Nandan ) కాగా అమ్మాయి పేరు ఆధ్యా కాత్యాయిని( Adhya Kathyaini ) .
"""/" /
ఇలా ఒకరికి రెండు పేర్లు పెట్టడం ఏంటి అసలు ఈ పేర్లు వెనుక అర్థం ఏంటి అనే ప్రశ్న ఈమెకు ఎదురు కావడంతో అబ్బాయికి అఖీరా అనే పేరు తనకు నచ్చి పెట్టానని కానీ నందన్ అనే పేరు వాళ్ళ డాడీకి నచ్చడంతో నందన్ అని పెట్టుకోవడం వల్ల తన పేరు అకీరానందన్ గా మారిపోయిందని రేణు దేశాయ్ వెల్లడించారు.
ఇక ఆధ్యా కడుపులో ఉన్నప్పుడు తాను ఒక ఆధ్యాత్మిక బుక్కు చదువుతున్నాను.అందులో తనకు ఆధ్యా అనే పేరు చాలా బాగా నచ్చిందని ఆధ్యా అంటే మహాశక్తి మహాకాళి మహాలక్ష్మి అనే మూడు పేర్ల కలయిక కావడంతో నాకు ఈ పేరు చాలా బాగా నచ్చింది.
అయితే గాయత్రి అమ్మ వారి పేరు అయినటువంటి కాత్యాయిని పేరు కూడా తనకు బాగా నచ్చింది.
ఇక రెండిట్లో ఏది పెట్టాలి అనుకుంటూ ఉండగా తన నక్షత్రం ప్రకారం కా అని వస్తే కాత్యాయిని పెట్టాలని నిర్ణయించుకున్నాను.
నక్షత్రం ప్రకారం అదే అక్షరం రావడంతో తనకు ఆ పేరు పెట్టాను ఇక తన పేరుకు ముందు ఆధ్యా అని పెట్టుకున్నానని ఇలా పిల్లల పేర్ల విషయంలో ముందుగా ప్లాన్ చేసి పెట్టుకోలేదు.
ఇద్దరి పేర్లు ఏ తో స్టార్ట్ అవుతాయి.అలాగే ఏ తోనే ఎండ్ అవుతాయి .
ఇంగ్లీషులో అకీరా ఆద్య ఇద్దరు పేర్లు కూడా ఫైవ్ లెటర్స్ వస్తాయని ఈ సందర్భంగా తన పిల్లల పేర్లు వెనుక ఉన్న అర్థాల గురించి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నో ప్రాబ్లమ్.. కాల్ మీ ఆంటీ.. వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!