యూకే పర్యటనలో జైశంకర్ బిజీబిజీ .. రిషి సునాక్‌కు దీపావళి కానుకలు, ఐదు రోజులు అక్కడే

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( External Affairs Minister Dr S Jaishankar ) యూకేలోని బీఏపీఎస్ శ్రీ స్వామి నారాయణ మందిరాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ సమాజం శాంతి సామరస్యం , శ్రేయస్సును కాంక్షించినట్లు ఆయన తెలిపారు.

ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన పలు అంశాలను సమీక్షించడం, స్నేహపూర్వక సంబంధాలకు కొత్త ఊపు అందించే లక్ష్యంతో జైశంకర్ ఐదు రోజుల పాటు బ్రిటన్‌లో పర్యటించనున్నారు.

లండన్‌లోని బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ నిర్వహణలో శ్రీ స్వామి నారాయణ్ మందిర్ వుంది.

ఈ ఆలయాన్ని నీస్‌డెన్ టెంపుల్ ( Neasden Temple )అని కూడా పిలుస్తారు.

దీపావళి సందర్భంగా తనకు సమయం కేటాయించినందుకు బీఏపీఎస్ నిర్వాహకులకు జైశంకర్ ధన్యవాదాలు తెలిపారు.

"""/" / అంతకుముందు బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్( British Prime Minister Rishi Sunak ), ఆయన సతీమణి అక్షతామూర్తిలను 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కలిశారు జైశంకర్.

ఈ సందర్భంగా రిషి దంపతులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు.జైశంకర్ వెంట ఆయన సతీమణి క్యోకో జైశంకర్ కూడా వున్నారు.

దీపావళి నాడు యూకే ప్రధాని రిషి సునాక్‌ను కలవడం ఆనందంగా వుందని జైశంకర్ ట్వీట్ చేశారు.

భారత్ - యూకే ( India - UK )సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న బ్రిటన్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

రిషి దంపతులు తమకు అందించిన ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. """/" / ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi ) తరపున రిషి సునాక్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జైశంకర్.

బ్రిటీష్ ప్రధానికి వినాయకుడి విగ్రహాన్ని, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు.

ఇకపోతే .నవంబర్ 15 వరకు జైశంకర్ యూకేలో పర్యటిస్తారు.

ఈ సందర్భంగా బ్రిటన్‌కు చెందిన పలువురు ప్రముఖులను ఆయన కలవనున్నారు.అలాగే చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి జైశంకర్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీనితో పాటు యూకేలోని భారత హైకమీషన్ ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు.

డార్క్ అండర్ ఆర్మ్స్ ను వైట్ గా స్మూత్ గా మార్చే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ మీ కోసం!