ప్రవాసీ భారతీయ దివస్ 2025 : రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్.. ఈసారి ఎక్కడ, ఎప్పుడు?

ప్రవాస భారతీయులు, విదేశాలలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తుల కోసం ప్రతియేటా భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ దివస్’( Pravasi Bharatiya Divas ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

2025వ సంవత్సరానికి సంబంధించిన ఈవెంట్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.ప్రవాసీ భారతీయ దివస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అన్ని వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ను మంగళవారం భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ,( MEA S Jaishankar ) ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ( Odisha CM Mohan Charan Majhi ) ప్రారంభించారు.

"""/" / ప్రవాసీ భారతీయ దివస్ 2025 ఈవెంట్ జనవరి 8 నుంచి 10 వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో( Bhuvaneshwar ) జరగనుంది.

ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

ఈ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్స్‌ సదుపాయం కూడా కల్పించినట్లుగా వెల్లడించింది."Diaspora’s Contribution To A Viksit Bharat” అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ జరగనుంది.

ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రవాసీ భారతీయ దివస్ యూత్ ఎడిషన్‌ను నిర్వహించనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేస్తారు. """/" / పీబీడీ వెబ్‌సైట్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ.

ప్రధాని మోడీ తన అధికారిక పర్యటనల నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడల్లా అక్కడి ప్రవాస భారతీయులను ఖచ్చితంగా కలుస్తున్నారని తెలిపారు.

వికసిత్ భారత్ వైపు భారతదేశం సాగించే యాత్రలో ప్రవాస భారతీయులు కీలకపాత్ర పోషిస్తున్నారని జైశంకర్ అన్నారు.

కాగా.జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి 1915 జనవరి 9న తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2003 నుండి ప్రతి ఏటా ప్రవాసీ భారతీయ దివస్‌ను జరుపుతోంది.

ప్రవాస భారతీయులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా భారతదేశ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు చేసిన కృషికి గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.