ఈ యాప్స్‌లో ఏ ఒక్క యాప్ వాడినా.. మీ ఫోన్ పని ఖతం!
TeluguStop.com
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండే అన్ని యాప్స్ సేఫ్ కాదు.అలాగే వాటి వల్ల ఫోన్ కూడా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
అయితే తాజాగా మెకేఫే సెక్యూరిటీ సంస్థ ప్లేస్టోర్‌లో 16 యాప్స్ కారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డ్రైన్ అవుతుందని.
మొబైల్ డేటా కూడా చాలా అధికంగా కన్స్యూమ్ అవుతుందని వెల్లడించింది.దాంతో గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి ఈ 16 యాప్‌లను తాజాగా తొలగించింది.
ఈ అప్లికేషన్లు నిజమైన యూజర్ల వలె యాక్ట్ చేస్తూ ఆ యూజర్ల ప్రమేయమేం లేకుండానే యాడ్స్‌ను క్లిక్ చేస్తున్నాయి.
పైకి యూజర్లకు ఏం తెలియకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ యాప్స్ వెబ్ పేజీలకు రీడైరెక్ట్ అవుతూ ఫోన్ నుంచి యాడ్స్‌పై క్లిక్ చేస్తున్నాయి.
వీటి వెనుక ఉన్న మోసం, బగ్‌లను మెకేఫే భద్రతా సంస్థ గుర్తించింది.ఈ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తీసివేయక ముందే వీటికి 20 మిలియన్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి.
ఈ యాప్‌లు సాధారణంగా QR కోడ్‌ని స్కాన్ చేయడానికి, లింక్డ్ వెబ్‌సైట్‌ను సందర్శించడానికి వినియోగదారులను అనుమతించడం, ఫోన్ ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేయడం లేదా కరెన్సీ కన్వర్టర్, కాలిక్యులేటర్ వంటి బేసిక్ టాస్క్స్ నిర్వహిస్తాయి.
"""/"/
ఈ 16 యాప్స్‌ల లిస్ట్‌లో హై-స్పీడ్ కెమెరా, స్మార్ట్ టాస్క్ మేనేజర్, మెమోక్యాలెండర్, కే-డిక్షనరీ, బుసాన్ బస్, ఫ్లాష్‌లైట్ +, క్విక్ నోట్, కరెన్సీ కన్వర్టర్, జాయ్‌కోడ్, ఈజెడ్‌డికా, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్‌లోడర్, ఈజెడ్ నోట్స్, ఫ్లాష్‌లైట్ (flashlite), క్యాల్‌కల్, ఇమేజ్‌వాల్ట్ ఫ్లాష్‌లైట్ ఉన్నాయి.
వీటిలో మీరు ఏ ఒక్కటి వాడుతున్నా కూడా మీ ఫోన్ పని ఖతమైపోతుందని నిపుణులు అంటున్నారు.
మరి వీటిలో ఏవైనా మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేసుకోండి.
ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్ నరకయాతన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!