అమెరికా అధ్యక్ష రేసు నుంచీ తప్పుకున్న మేయర్
TeluguStop.com
అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల హీట్ రోజు రోజుకి పెరిగిపోతోంది.ఈ సారి ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని డెమోక్రాటిక్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే.
మళ్ళీ రిపబ్లికన్ పార్టీ నుంచీ బరిలోకి దిగుతున్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సారి కూడా అధికారాన్ని చేపట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
డెమోక్రాటిక్ పార్టీ నుంచీ ఎంతో మంది అధ్యక్ష బరిలో నిలిచి వారి బలాబలాలు ప్రదర్శిస్తూ తుది పోరుకోసం సిద్దమవుతున్నారు.
ఈ క్రమంలోనే తాను అధ్యక్ష పదవి రేసు నుంచీ తప్పుకుంటున్నాను అంటూ డెమోక్రాటిక్ పార్టీ నేత న్యూయార్క్ నగర మేయర్ బిల్ డే బ్లాసియో తెలిపారు.
తాను అధ్యక్షుడుగా పోటీ చేయడానికి సరైన సమయం ఇది కాదని భావిస్తున్నానని ఆయన అన్నారు.
"""/"/
ఎట్టిపరిస్థితుల్లోనూ తన అభ్యర్ధిత్వాన్ని ప్రజలు ఆమోదించరు, అందుకు తగ్గట్టుగా పరిస్థుతులు నాకు అనుకూలంగా లేవు అంటూ బిల్ డే వ్యాఖ్యానించారు.
అతిపెద్ద నగరం అయిన న్యూయార్క్ కి మేయర్ గానే ఇకపై తాను కొనసాగుతానని అయన తెలిపారు.
శ్రామికులకి వారధిగా ఎలాంటి పోరాటం చేశానో ఇకపై అలాగే వారికి అండగా ఉంటానని అన్నారు.
అయితే బిల్ డే ఒక్క సారిగా ఇలాంటి ప్రకటన చేయడంపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.
అసలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయోనని అమెరికా రాజకీయవర్గాలలో తీవ్ర చర్చ నడుస్తోంది.
గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?