తన రూటే సపరేట్ అంటున్న మాయావతి
TeluguStop.com
దేశంలోని ప్రదాన రాజకీయ పార్టీలన్నీ అటు ఇండియా కూటమి( INDIA ) వైపో లేక ఎన్డీఏ కూటమి( NDA ) వైపో చేరిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా ఏ కూటమి లోకి చేరకుండా ఉన్న పార్టీలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్సిపి, టిడిపి, తెలంగాణ నుంచి బారాస ,ఉత్తరప్రదేశ్ నుంచి బహుజన సమాజ్ పార్టీ, బిజూ జనతా దళ్ మాత్రమే .
రెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తున్నాయి.అయితే ఈ పార్టీలన్నీ కేవలం భాజపాకు అంతిమంగా లబ్ధి చేకూర్చడం కోసమే విడిగా పోటీ చేస్తున్నాయని ఆయా రాష్ట్రాల్లో బిజెపి వ్యతిరేకతను చీల్చి అంతిమంగా దాని ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయని బిజెపికి బీ టీం లాగా మారిపోయాయి అని ప్రచారం జరుగుతుంది.
"""/" /
అయితే తాము ఈ రెండు కుటమిలకూ దూరంగా ఉంది సొంతం గా పోటీ చేస్తామని ప్రకటించారు మాయావతి.
( Mayawati ) ఈ రెండు కూటములు కూడా కులతత్వం మతతత్వ భావనలతో నిండిపోయాయని, పెట్టుబడుదారి అనుకూల విధానాలను అవలంబిస్తున్నాయని ,వర్గ పోరును ప్రోత్సహిస్తాయని ఇలాంటి కూటమి లో చేరాల్సిన అవసరం లేదంటూ ఆమె తేల్చేశారు.
మొదటి నుంచి ఈ విధానాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న తమ పార్టీ ఆ కూటములలో ఎందుకు చేరుతుందని తనతో పొత్తు కోసం ఎదురుచూసి ఇప్పుడు తమను బిజెపి బి టీం అని విమర్శించడం సరికాదంటూ ఆమె ఆగ్రహించారు.
"""/" /
అందని ద్రాక్ష పుల్లన అన్నట్టుగావిపక్షాల తీరు ఉందంటూ ఆమె ఫైర్ అయ్యారు.
2017 ఎన్నికల్లో 19 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బహుజన్ సమాజ్ పార్టీ( BSP ) 2022 ఎన్నికలలో కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకుంది.
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో( Uttar Pradesh ) తమ ప్రభావాన్ని క్రమంగా కోల్పోతున్న ఈ పార్టీ భాజాపా తో లోపాయికారి ఒప్పందాలతోనే భాజపాకు( BJP ) అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ గతంలో కూడా విమర్శలు వచ్చాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ మిజోరం వంటి రాష్ట్రాలలో పోటీ చేసి అక్కడ దళిత మైనారిటీల ఓటింగ్ చీల్చి భాజాపాకు ఉపయోగపడే బీ టీం లా తయారైందని ఈ పార్టీపై ఉన్న ప్రదాన ఆరోపణ.
ఇప్పుడు వాటన్నింటినీ ఖండిస్తున్న మాయావతి మరోసారి తాము రాజకీయాల్లోక్రియాశీలక పాత్ర పోషించ బోతున్నట్టుగా చెప్పుకొచ్చారు
.
వైరల్ వీడియో: గోల్డ్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా.. దాని ధర ఎంతో తెలిస్తే..