వైరల్ అవుతున్న మాయంతి స్టువర్ట్ బిన్నీ 2008 ఇంటర్వ్యూ!

భారతదేశం లో క్రికెట్ అనేది ఒక మతం అని అందరికి తెలిసిందే, ఇక్కడ క్రికెట్ కు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు.

ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని క్రికెట్ బోర్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) అని ఒక సరికొత్త టోర్నమెంట్ ను ప్రవేశపెట్టింది, ప్రపంచంలో ఇలాంటి టోర్నమెంట్ లు ఎన్ని ఉన్నా IPL ప్రత్యేకం.

అయితే IPL కు ముందు ఇండియన్ క్రికెట్ లీగ్ (ICL) అని ప్రారంభమైంది, దీనికి IPL కున్నంత ఆదరణ లభించలేదు.

ఇదిలా ఉండగా 2008లో ICL సమయంలో మయంతి లాంగర్ అనే యాంకర్ స్టువర్ట్ బిన్నీ ని ఇంటర్వ్యూ తీసుకుంది, అయితే ఆ ఇంటర్వ్యూలో మయంతి స్టువర్ట్ ని తన పెళ్లి గురించి ప్రస్తావించగా స్టువర్ట్ బిన్నీ అదేమి లేదు అదంతా పుకార్లు అంటూ కొట్టి పడేసాడు.

తీరా చూస్తే 2012లో వీరిద్దరికి వివాహం జరిగింది, తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరి 2008లో ఆ ఇంటర్వ్యూ చేసాక వాళ్ళకి పరిచయం ఏర్పడిందా లేక ముందే వాళ్లకు పరిచయం ఉందా అనే విషయం చాలా మంది ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

మీకు గాని ఈ విషయం తెలిస్తే కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయండి.

ఆ స్టార్ హీరోయిన్ కు రామ్ చరణ్ తెలుగు నేర్పించాడా.. ఏం జరిగిందంటే?