ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజ్ అవుతున్న భారీ సినిమాలు, సిరీస్ లు ఇవే!

మే నెల మొదటి వారం రిలీజైన సినిమాలలో ఉగ్రం సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోగా రామబాణం సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

మే నెల రెండో వారం విడుదలవుతున్న సినిమాపైనే ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి.

ఈ వారం విడుదలవుతున్న సినిమాల విషయానికి వస్తే కస్టడీ సినిమాపై( Custody Movie ) భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

నాగచైతన్య, కృతి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మే నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన హిందీ ఛత్రపతి సినిమా( Chatrapathi ) కూడా మే నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమా హిందీలో ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.సునీల్, శ్రీనివాస్ రెడ్డి మరి కొందరు కమెడియన్లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భువన విజయమ్( Bhuvana Vijayam Movie ) కూడా అదే తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

"""/" / క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ది స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ కూడా అదే తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

శేఖర్ అయాన్ వర్మ, వైభవి రామ్ జంటగా నటించిన కళ్యాణమస్తు మూవీ కూడా మే నెల 12వ తేదీన రిలీజ్ కానుందని తెలుస్తోంది.

శ్రియ కీలక పాత్రలో నటించిన మ్యూజిక్ స్కూల్ కూడా అదే తేదీన విడుదల కానుంది.

ఆహా ఓటీటీలో మే నెల 12వ తేదీన న్యూసెన్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

"""/" / సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో తెరకెక్కిన దహాద్ వెబ్ సిరీస్ ఈ నెల 12 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

జియో సినిమాలో మే నెల 12 నుంచి విక్రమ్ వేద హిందీ స్ట్రీమింగ్ కానుంది.

బుక్ మై షోలో మే నెల 10వ తేదీన ఎస్సాసిన్ క్లబ్ హలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

సోనీ లివ్ లో మే నెల 12 నుంచి ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్ హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ది మప్పేట్స్ మేహెమ్ వెబ్ సిరీస్ తో పాటు స్వప్నసుందరి తెలుగు, తమిళ వెర్షన్లు స్ట్రీమింగ్ కానున్నాయి.

"""/" / జీ5 యాప్ లో తాజ్ ది రీన్ ఆఫ్ రివేంజ్ హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ లో ఎయిర్ అనే హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే రాయల్ టీన్ ప్రిన్సెస్ మార్గరెట్, ఎరినీ హాలీవుడ్ సిరీస్ లు మే నెల 11వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయి.

ది మదర్ అనే హాలీవుడ్ సిరీస్, క్రాటర్, బ్లాక్ నైట్ సిరీస్ లు మే నెల 12వ తేదీన స్ట్రీమింగ్ కానున్నాయని తెలుస్తోంది.

కొరియన్ మరదలికి ఆలూ పూరీ టేస్ట్ చూపించిన ఇండియన్.. రియాక్షన్ వైరల్!