మే 9వ తేదీ టాలీవుడ్ కు ఎంతో స్పెషల్.. ఈ తేదీన విడుదలైన ఇన్ని సినిమాలు హిట్టయ్యాయా?

టాలీవుడ్ ఇండస్టీకి ఏప్రిల్ 28వ తేదీ లక్కీ డేట్ అనే సంగతి తెలిసిందే.

ఆ తేదీన విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.అయితే ఏప్రిల్ 28వ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆ స్థాయిలో కలిసొచ్చిన డేట్ ఏదనే ప్రశ్నకు మాత్రం మే 9వ తేదీ సమాధానంగా వినిపిస్తుంది.

మే 9వ తేదీ టాలీవుడ్ కు ఎంతో స్పెషల్ డేట్ కావడం గమనార్హం.

చిరంజీవి, మహేష్ బాబు లాంటి చాలామంది హీరోలకు ఈ డేట్ కలిసొచ్చింది.1990 సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ( Jagadekaveerudu Atilokasundari Movie )అప్పట్లోనే 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు ఐదు విభాగాలలో నంది అవార్డులు వచ్చాయి.చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా సైతం అదే తేదీకి విడుదలైంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

"""/" / వెంకటేశ్ హీరోగా నటించిన ప్రేమించుకుందాంరా సినిమా( Preminchukundam Ra ) సైతం ఇదే తేదీన థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.

నాగార్జున దశరథ్ కాంబోలో తెరకెక్కిన సంతోషం సినిమా ( Santhosham )సైతం ఇదే తేదీన విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాలో నాగ్ నటనను నంది అవార్డ్ వచ్చింది.కీర్తి సురేష్ నటించిన మహానటి( Mahanati ) సినిమా సైతం ఇదే తేదీన విడుదలైంది.

"""/" / పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన మహానటి సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటిందనే చెప్పాలి.

ఈ సినిమా కీరి సురేష్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా( Maharshi Movie ) సైతం ఇదే తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.

కల్కి ఇదే తేదీన విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.

అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటి..?