పెళ్లి మండపంలో మోహన్ బాబుని చూసి బోరున ఏడ్చేసిన మౌనిక.. ఫోటోలు వైరల్!
TeluguStop.com
మంచు మనోజ్ భూమా మౌనికల వ్యవహారం గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలకు నిన్నటితో పూర్తిగా చెక్ పడింది.గత కొంతకాలంగా వీరు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై మంచు కుటుంబం ఎక్కడ అధికారక ప్రకటన ఇవ్వకపోవడంతో ఇందులో నిజం ఎంతుందనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ఈ విషయం గురించి మనోజ్ సైతం అధికారక ప్రకటన ఇవ్వకపోవడంతో అభిమానులు కాస్త సందిగ్ధంలో ఉండిపోయారు.
"""/" /
ఇకపోతే మార్చి మూడవ తేదీ మనోజ్ మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ పెళ్లి విషయం గురించి ప్రకటన ఇవ్వలేదు కానీ మనోజ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి షేర్ చేయడంతో వీరి పెళ్లి గురించి క్లారిటీ వచ్చింది.
ఇలా మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం ఫిలింనగర్ లోని మంచు నిలయంలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇలా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో మనోజ్ మౌనిక మెడలో మాంగల్య ధారణ చేశారు.
బంగారు వర్ణంలో వధూవరులు మెరిసిపోతూ ఉండగా పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఈ దంపతులను ఆశీర్వదించారు.
"""/" /
ఇకపోతే మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి మోహన్ బాబు ఈ పెళ్లికి దూరంగా ఉన్నారని అందుకే మనోజ్ పెళ్లి బాధ్యతను మంచు లక్ష్మి తన భుజాలపై వేసుకొని తన ఇంట ఈ పెళ్లి వేడుకలను నిర్వహించిందని తెలుస్తోంది.
ఇలా మోహన్ బాబు ఈ పెళ్లికి వస్తారా రారా అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు.
అయితే మోహన్ బాబు దంపతులు మనోజ్ పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇలా మోహన్ బాబు దంపతులు పెళ్లి మండపానికి రావడంతో వారి ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో మౌనిక ఒక్కసారిగా మోహన్ బాబుని చూడగానే ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారనీ తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక వీరి వివాహానికి మంచు విష్ణు కేవలం ఒక అతిథిలాగా వచ్చి వెళ్లడంతో ఈ విషయం కాస్త పలు చర్చలకు దారితీస్తోంది.
విష్ణుకి నిజంగానే మనోజ్ పెళ్లి ఇష్టం లేదా అంటూ చర్చలు మొదలయ్యాయి.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
అమెరికా కాలేజీలో చైయ్యా చైయ్యా సాంగ్‌తో అదరగొట్టారు.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ పక్కా..