శ్రీకృష్ణ జన్మభూమిపై మధుర కోర్టు కీలక తీర్పు
TeluguStop.com
శ్రీకృష్ణ జన్మభూమిపై మధుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది.వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు సర్వేను జనవరి 20వ తేదీలోగా పూర్తి చేయాలని ధర్మాసనం సూచించింది.
శ్రీకృష్ణ జన్మభూమిపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది.ఈ క్రమంలో హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
మసీదును కృష్ణుడి జన్మస్థలమైన కృష్ణ జన్మభూమిపై నిర్మించారని పేర్కొంటూ దానిని తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈద్గా మసీదు కృష్ణుడి జన్మభూమికి ఆనుకుని ఉందని, ఆలాయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మధుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ఆ సినిమా సెట్లో ఎగతాళి చేశారు.. శ్వేతా బసు ప్రసాద్ క్రేజీ కామెంట్స్ వైరల్!