అగ్గిపెట్టె కూడా షాక్ ఇవ్వబోతుందట.. ఎవరికంటే?

ఈ మధ్య దేశంలో ప్రతి వస్తువు ధర పెరుగుతుంది.నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇలా ధరల భారం సామాన్యులపై పెరగడంతో అందరికి వెన్నులో వణుకు పుడుతుంది.ఈ ధరల భారాన్ని మోయలేక మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.ఎప్పుడు లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి.

60 రూపాయలుగా ఉండే పెట్రోల్ ధర ఇప్పుడు సెంచరీ కూడా కొట్టేసి ఇంకా పెరుగుతూ పోతుంది.

వీటికి మోడీ ప్రభుత్వం కళ్లెం వేయలేక పోతుంది.ఇక పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరగడంతో వీటి ప్రభావం నిత్యావసర వస్తువుల మీద కూడా పడింది.

దీంతో అన్ని వస్తువుల ధరలు అమాంతంగా పెరిగి మధ్య తరగతి ప్రజలకు భారంగా మారాయి.

"""/" / ఇక తాజాగా అగ్గి పెట్టె కూడా సామాన్యులపై భారం అవ్వనుంది.

14 సంవత్సరాల నుండి ఒక అగ్గి పెట్టె ధర 1 రూపాయిగా మాత్రమే ఉంది.

ఇన్ని ఏళ్లుగా దీని ధరను పెంచలేదు.కానీ 14 సంవత్సరాల తర్వాత అగ్గి పెట్టె ధరను కూడా పెంచాలని తయారీ దారులు నిర్ణయించారని తెలుస్తుంది.

ఇకపై అగ్గి పెట్టె ధర 2 రూపాయలుగా నిర్ణయించారు.పెరిగిన ఈ ధర డిసెంబర్ 1 నుండి అమలులోకి రానుంది.

అయితే ఈ ధరలు పెరగడానికి కారణం ముడిసరుకులు ధరలు పెరగడమే అంటున్నారు.రెడ్ ఫాస్పరస్ రూ.

425 గా ఉండేదట.కానీ ఇప్పుడు రూ.

810 కి చేరింది ఇక మైనం ధర రూ.58 గా ఉండేది.

ఇప్పుడు 80 రూపాయలకు చేరడంతో అగ్గి పెట్టె ధర పెంచక తప్పడం లేదని తయారీ దారులు చెబుతున్నారు.

ఇప్పటికైనా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర ధరలను తగ్గించాలని ప్రజలు ప్రభుత్వాలను కోరుతున్నారు.

నెల్లిమర్ల బహిరంగ సభలో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ చంద్రబాబు