అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చందుర్తి మండలం కిష్టంపేట, మల్యాల గ్రామంలో అమ్మ మాట -అంగన్వాడి బాట( Amma Mata- Anganwadi Bata ) కార్యక్రమంలో భాగంగా ర్యాలీని సోమవారం నిర్వహించారు సూపర్వైజర్ శంకరమ్మ, ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర , అంగన్వాడి పాఠశాలకు కొత్త పాఠ్యప్రణాళిక ద్వారా పిల్లలకు ఆట, పాట, కథ, స్వేచ్ఛ, ఆటల ద్వారా సులభతరం నుంచి కష్టతరం విద్య అంగన్వాడి కేంద్రంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల్లో మేధో వికాస అభివృద్ధి నైతిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి వికసించే విధంగా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా బోధనా పద్ధతి రూపొందించారని చెప్పడం జరిగింది.
ప్రైవేటు పాఠశాలకు దీటుగా అంగన్వాడీ కేంద్రం( Anganwadi Center )లో విద్య నేర్పించబడుతుంది అని తల్లులకు ఇంటింటికి వెళ్లి గృహ సందర్శన ద్వారా వారికి అవగాహన కల్పించడం జరిగింది.
సూపర్వైజర్ ఆధ్వర్యంలో అంగన్వాడి సెంటర్లో కల్పిస్తున్న సేవలను గురించి తల్లులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అంగన్వాడీ టీచర్స్ మంజుల, జ్యోతి, సంధ్య, పుష్పలత ఉపాధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.
How Modern Technology Shapes The IGaming Experience