తమన్నాతో సీటీమార్ కొట్టిస్తున్న గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు.చేసని ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో మనోడు సక్సెస్ కోసం ఆకలి మీద ఉన్నాడు.

అయితే ఈసారి ప్రముఖ దర్శకుడు సంపత్ నందితో గోపీచంద్ తన నెక్ట్స్ మూవీని లాంఛ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది.ఈ సినిమా ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.సీటీమార్ సినిమా ఈ సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుందట.

""img "aligncenter" Src="" / మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో నటించేందుకు కబడ్డీ ఆట మెలకువలు కూడా నేర్చుకుంటోంది.

సంపత్ నంది డైరెక్షన్‌లో రాబోయే ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ ప్రేక్షకులతో సీటీమార్ కొట్టిస్తాడా లేదా అనేది చూడాలి.

సలార్ 2 లో కీలక పాత్ర లో నటించనున్న స్టార్ హీరో…