మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురు మృతి

మహారాష్ట్ర( Maharashtra )లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఔరంగాబాద్( Aurangabad ) లోని ఓ వస్త్ర దుకాణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

భారీగా ఎగిసిపడిన అగ్నికీలలు పై అంతస్తుకు వ్యాపించాయి.భారీ మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో ఇంటిలో ఉన్న ఏడుగురు ఊపిరాడక మృత్యువాత పడ్డారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చింది.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఫారెన్ మొగుడు పానీ పూరీ ఎలా తిన్నాడో చూసి ఫిదా అయిపోయిన దేశీ భార్య.. (వీడియో)