మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు.
TeluguStop.com
200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరిక సిరిసిల్ల నియోజకవర్గంలో దూసుకుపోతున్న హస్తం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ( Balaraj Yadav Is A Former MPTC )ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు.
మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ నిర్మల యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు .
బి ఆర్ ఎస్, ప్రభుత్వంలో ఎస్సై, ఉద్యోగం కోసం టి ఎస్, పిఎస్ సి, ఎగ్జామ్ రాసిన ఈ ప్రభుత్వంలో ఉద్యోగం దక్కలేదని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నైన ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేరానని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె వెల్లడించారు.
ఇట్టి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకే ఓటు వేసి కేకే మహేందర్ రెడ్డిని గెలిపిస్తామని వారు విలేకరుల సమావేశంలో అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మా పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు రాలేదని నానా కష్టాలు పడి పిల్లలను చదివించుకుని ఇప్పుడు జాబ్కై ఎదురుచూస్తూ దిక్కు తోచని స్థితిలో ఇంట్లో కూర్చొని ఉద్యోగం ఎదురుచూస్తున్నారనీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా ఉద్యోగాలు సాధిస్తారని అన్నారు.
గత తొమ్మిది సంవత్సరాలు నుండి బిఆర్ఎస్ పార్టీ చెందిన కేటీఆర్ కెసిఆర్ కల్లబొల్లి మాటలు చెబుతూ యూత్ ను చదువుకున్న వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తూ మోసగిస్తున్నాడని వారి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోటి మా పిల్లలు ఉద్యోగాలు పొందుతారని చేతు గుర్తుకే ఓటు వేస్తామని తెలియజేస్తున్నామనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు దీటి.
బాలయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు , జిల్లా ఉపాధ్యక్షులు కోమిరిషెట్టి తిరుపతి ఎస్.
కె గౌస్, గంభీరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, బుచ్చి లింగు సంతోష్ గౌడ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి,పుల్లయ్య గారి తిరుపతి వీర్నపల్లి మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వెయిట్ లాస్ కు తోడ్పడే బెస్ట్ స్మూతీ ఇది.. వారానికి 2 సార్లు తీసుకున్న మస్తు లాభాలు!