రోజు నైట్ ఈ జెల్‌తో మ‌సాజ్ చేసుకుంటే ఎంత వ‌య‌సొచ్చినా యంగ్‌గా మెరుస్తారు!

వయసుతో పాటు యవ్వనం కూడా కరిగిపోవ‌డం స‌ర్వ సాధార‌ణం.అందులోనూ ప్రస్తుత కాలంలో చాలా మంది తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయ‌ల‌కు చేరువ‌వుతూ య‌వ్వ‌నాన్ని కోల్పోతున్నారు.

అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.అయితే ఎంత వ‌య‌సొచ్చినా కొందరు మాత్రం యంగ్ గా కనిపిస్తుంటారు.

అలాంటి వారిని చూసినప్పుడల్లా మనసులో అసూయ కలుగుతుంటుంది.నిజానికి సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎవ్వరైనా లేటు వయసులోనూ యంగ్ గా మెరిసిపోవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ జెల్ తో రోజు మసాజ్ చేసుకుంటే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా క‌నిపించ‌డం ఖాయం.

మరి ఇంతకీ ఆ జెల్ ను ఎలా తయారు చేసుకోవాలి.? ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెపెట్టి అందులో గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల‌ అవిసె గింజలు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.అలాగే స్ట‌వ్ పై మరో గిన్నె పెట్టి గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఫ్రెష్ గా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఉడికిస్తే వాటర్ జెల్లిగా మారుతుంది.

"""/"/ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

అనంత‌రం ఒక బౌల్ లో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజల జెల్‌, మూడు టేబుల్ స్పూన్లు బెండకాయ జెల్‌, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్‌ ఆయిల్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అయిదారు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మెరిపించే జెల్ సిద్ధం అయినట్టే.

ఈ జెల్‌ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ జెల్ ను ముఖానికి, మెడకు అప్లై చేసి వేళ్ళతో స్మూత్ గా కాసేపు మసాజ్ చేసుకోవాలి.

ఇలా ప్రతిరోజు కనుక చేస్తే వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.దాంతో వయసు పెరుగుతున్నా మీ చర్మం యవ్వనంగా మరియు ప్రకాశవంతంగా మెరిసిపోతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 21, మంగళవారం2024