వాల్తేరు నుండి క్రేజీ ట్రీట్.. మెగాస్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ!
TeluguStop.com
ప్రెజెంట్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు క్రేజీ సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా ఉంది.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆచార్య ప్లాప్ ను మరిపించే విధంగా హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో సినిమాను రెడీ చేస్తున్నాడు.గాడ్ ఫాదర్ సినిమా ఎంత సక్సెస్ అయినా కూడా చిరు నెక్స్ట్ సినిమాపైనే మెగా ఫ్యాన్స్ ద్రుష్టి ఉంది.
ఎందుకంటే గాడ్ ఫాదర్ రీమేక్ సినిమా కావడంతో నెక్స్ట్ వాల్తేరు వీరయ్య సినిమాపై అంచనాలను పెంచుకున్నారు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతుంది.బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నారు.
ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.చివరి దశకు చేరుకున్న ఈ సినిమా గురించి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.
ఇప్పుడు కూడా మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.మేకర్స్ ఈ సినిమా నుండి ఇప్పటికే చిరు రోల్ పరిచయం చేస్తూ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసారు.
ఇక ఇప్పుడు మెగా అభిమానుల కోసం మరో మాస్ ట్రీట్ రెడీ చేస్తున్నట్టు తాజాగా సమాచారం అందుతుంది.
అయితే మొదటి టీజర్ లో వాల్తేరు వీరయ్యగా చిరును పరిచయం చేసిన బాబీ ఇప్పుడు మాస్ రాజా రవితేజ పాత్రను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
"""/"/
రవితేజ మీద కట్ చేసిన టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారని.
అందుకు సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది అని తెలుస్తుంది.చూడాలి మరి ఈ మాస్ ట్రీట్ ఎప్పుడు ఉంటుందో.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.