ఖమ్మంలో తుమ్మల అనుచరుల మూకుమ్మడి రాజీనామా..!

ఖమ్మంలో అధికార పార్టీ బీఆర్ఎస్ షాక్ తగిలింది.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అనుచరులు మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో తుమ్మల నివాసం వద్ద కీలక సమావేశం నిర్వహించిన ఆయన అనుచరులు ఒకేసారి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా పాలేరు నియోజకవర్గం నేతలు అందరూ కలిసి ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

తాము ఎప్పుడూ తుమ్మల వెంటనే నడుస్తామని అనుచరులు వెల్లడించారు.అయితే ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తుమ్మల హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..