కెరీర్ లో మొదటిసారి 'ధమాకా' కోసం అలా చేస్తున్న మాస్ రాజా!

మాస్ మహారాజా రవితేజ ఒకప్పుటి కంటే ఇప్పుడు చాలా మారిపోయాడు అని అంటున్నారు నెటిజెన్స్.

అందుకు కారణం కూడా ఉంది.ప్రెసెంట్ ఈయన చేస్తున్న సినిమాల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా ఒకటి.

కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో రవితేజ ఎప్పుడు లేనంతగా నమ్మకంతో ఉన్నాడు అని ఆయన సన్నిహితులు సైతం చెబుతున్నారు.

గత రెండు సినిమాల ప్లాప్ తో రవితేజ రేసులో వెనుక బడగా ఇప్పుడు మళ్ళీ ధమాకా సినిమాతో హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు.

అందుకే ఈ సినిమా మీద ఈయన ప్రత్యేక ద్రుష్టి పెట్టాడు.ఎప్పుడు లేని విధంగా ఆయన కెరీర్ లోనే మొదటిసారిగా యాక్టివ్ గా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

ఎప్పుడు రవితేజ ఇంత ఇదిగా ప్రమోషన్స్ లో పాల్గొన్న సందర్భాలు లేదు.అయితే ధమాకా సినిమా కోసం రెండు వారాల ముందుగానే ప్రొమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపు తున్నాడు.

రవితేజ ముందుగానే రెండు వారాలను ప్రొమోషన్స్ కోసం కేటాయించాలని నిర్ణయించు కున్నారట.మరి తన కెరీర్ లో ఒక సినిమా కోసం మిగత సినిమాల షూట్ పక్కన పెట్టి మరీ ప్రొమోషన్స్ లో పాల్గొన్న సందర్భాలు లేవు.

కానీ ఈసారి ఎక్కడ చూసిన రవితేజ ప్రొమోషన్స్ చేస్తూ ఈ సినిమాను జనాలకు చాలా దగ్గర చేసాడు.

"""/"/ మరి ఇంతగా ఈయన ప్రత్యేక ద్రుష్టి పెట్టడంతో సినిమా విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్ధం అవుతుంది.

అయితే ఇదే శ్రద్ధ అన్ని సినిమాలకు చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో ప్రొమోషన్స్ కారణంగానే ఓపెనింగ్స్ బాగా వస్తున్నాయి.

ఇదే విషయం తెలుసుకుని రవితేజ తన సినిమాలను పట్టించుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది అని అంటున్నారు.

బుల్లితెరపై సందడి చేయబోతున్న నటుడు శివాజీ.. మరో కొత్త అవతారం ఎత్తారుగా!