మాస్ రాజా కెరీర్ కు ఎలాంటి డోకా లేదా.. ఇలా చేసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

మాస్ మహారాజా రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు.

అంతా ఇక రవితేజ పని అయిపొయింది అని మాట్లాడు కుంటున్న తరుణంలో ఈయన హిట్స్ అందుకోవడంతో ఈ వార్తలు అన్ని ఆగిపోయాయి.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రవితేజ అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు.

అలా పడిలేచి ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్నాడు.మరి ఇలాంటి వారికీ పడిన మళ్ళీ లేచే సామర్థ్యం అనేది ఉంటుంది.

రవితేజలో ఉన్న కసి, పట్టుదల చూసి మెగాస్టార్ కూడా ముచ్చట పడుతుంటారు.ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్స్ తో మరోసారి రవితేజ పడిలేచిన కెరటంలా దూసుకు వెళ్తున్నాడు.

వాల్తేరు వీరయ్యలో ఈయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ మరోసారి మాస్ రాజా అంటే ఏంటో నిరూపించింది.

"""/"/ ఈయనకు హీరోగా అవకాశాలు తగ్గిపోయిన ఇలాంటి గెస్ట్ అప్పీరియన్స్ పాత్రలతో సినిమా స్థాయిని మార్చగలడు అనే నమ్మకం అభిమానులకు కలిగింది.

ఇలాంటి పాత్రలలో కొద్దీ సేపు కనిపించిన కానీ రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారు.

మాస్ రాజాకు మాస్ లో బాగా ఫాలోయింగ్ ఉండడంతో విక్రమార్కుడు లో విక్రమ్ రాథోడ్ పాత్ర లాంటి పాత్రలు చేసిన చాలు.

ఇది రవితేజ స్టామినా. """/"/ ఇక ప్రెజెంట్ అయితే మాస్ రాజా మంచి స్పీడ్ మీదనే ఉన్నాడు.

ఈయన చేసిన మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.రవితేజ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ''రావణాసుర''.

సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

అలాగే వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.

అలాగే మరికొన్ని సినిమాలు కూడా లైన్లో పెట్టడానికి రెడీ అవుతున్నాడు.