టైగర్ నాగేశ్వరరావు టీజర్ రివ్యూ.. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఉన్నా అది మైనస్ అంటూ?

మాస్ మహారాజ్ రవితేజ( Ravi Teja ) ధమాకా సినిమాతో సక్సెస్ సాధించగా రావణాసుర సినిమాతో భారీ షాక్ తగిలింది.

రావణాసుర సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.అయితే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.

హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీన్స్ తో టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్ లో రవితేజ కనిపించే షాట్స్ తక్కువే అయినా మురళీ శర్మ( Murali Sharma ) పాత్ర ద్వారా టైగర్ నాగేశ్వరరావు పాత్రకు ఎలివేషన్స్ ఇవ్వడం ఆకట్టుకుంది.

టైగర్ నాగేశ్వరరావు జైలు నుంచి తప్పించుకున్నాడనే డైలాగ్ తో టీజర్ మొదలు కాగా టీజర్ లో టైగర్ నాగేశ్వరరావు ప్రతిభ, తెలివితేటలకు సంబంధించి ఉన్న డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

1970 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కగా ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

"""/" / ఈ సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నపూర్ సనన్ నటిస్తుండగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం టైగర్ నాగేశ్వరరావు మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

"""/" / ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడంటూ చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలవుతుండగా ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్ విడుదలైంది.

అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.దసరాకు పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో మాస్ మహారాజ్ కు ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.

మరో డైరెక్టర్ కు తారక్ గ్రీన్ సిగ్నల్.. ఆ సినిమాతో ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయమా?