ఆ లెక్క ప్రకారం తెలుగులో రవితేజ నంబర్ వన్ హీరో.. నమ్మకపోయినా నిజమిదేనంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వేగంగా సినిమాల్లో నటిస్తున్న హీరో ఎవరనే ప్రశ్నకు రవితేజ పేరు సమాధానంగా చెప్పవచ్చు.

హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో రవితేజ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

2021 కరోనా తర్వాత రవితేజ ఏకంగా 9 సినిమాలలో నటించారంటే రవితేజ( Ravi Teja) స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో సులువుగా అర్థమవుతుంది.

గత కొన్నేళ్లలో రవితేజ నటించిన రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి.

"""/" / అయితే రవితేజ మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ ను పట్టించుకోకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రవితేజ నటించిన ఈగిల్ సినిమా( Eagle ) థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోవడం హాట్ టాపిక్ అయింది.

ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజయ్యేలా రవితేజ కెరీర్ ప్లానింగ్ ఉంది. """/" / మరికొన్ని రోజుల్లో రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమాలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse ) నటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమా కోసం శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఒక సాంగ్ లోని డ్యాన్స్ స్టెప్స్ విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రైడ్ మూవీకిరీమేక్ గా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి.

ఈ సినిమాకు పోటీగా డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ సినిమాలు విడుదల కానున్నాయి.వేగంగా సినిమాలు చేస్తున్న లెక్కల ప్రకారం రవితేజ నంబర్ వన్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

జొమాటోలో రూ.40 ఉప్మా రూ.120కి సేల్.. ఇదెక్కడి దోపిడీ??