మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు బాంధవీ శ్రీధర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె పేరు చెబితే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ మసూద సినిమాలో దెయ్యం క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

ఈ ఏడాది విడుదల అయిన బెస్ట్ హర్రర్ మూవీస్ లో మసూద ఒకటి అని చెప్పవచ్చు.

ఇందులో నాజియా పాత్రలో నటించింది ఈ బాంధవి శ్రీధర్.నాజియా క్యారెక్టర్ లో బాంధవి అల్లాడించేసింది.

థియేటర్ లో అందరినీ వణికించేసింది అనే చెప్పవచ్చు.అయితే మామూలుగా ఒక సినిమా హిట్ అయింది అందులో కొత్త క్యారెక్టర్ కనిపించింది అంటే చాలు వెంటనే వాళ్ళ గురించి వివరాలు ఆరా తీస్తూ ఉంటారు.

మసూద ఆ సినిమా తర్వాత కూడా చాలామంది బాంధవీ గురించి ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలోనే ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.మరి బాంధవి ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాంధవి శ్రీధర్ తెలుగ మ్మాయి.గుంటూరు జిల్లాకు బాంధవీ మొదట మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి వచ్చింది.

అలా 2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన బాంధవి,అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో విజేతగా నిలిచింది.

ఇక మసూద సినిమా తన ఫస్ట్ మూవీ.ఇదివరకు ఏ సినిమాలు, సీరియల్స్ లోనూ నటించలేదు.

"""/"/ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్న టైంలో మసూద మూవీ ఆఫర్ రావడంతో కంటెంట్, క్యారెక్టర్ నచ్చి ఓకే చేసిందట.

అలాగే నటిగా ఫస్ట్ మూవీ కాబట్టి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించిందని చెప్పింది బాంధవి.

మరి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న బాంధవికి ఇకపై ఎటువంటి ఆఫర్లు వస్తాయో చూడాలి మరి.

మరి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నా ఆమెకు సరైన అవకాశాలు వస్తాయా లేదా చూడాలి మరి.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు .. ఆ నలుగురు భారతీయులకు బిగ్ రిలీఫ్