ఆ ప్లేట్ ముక్కలను ఏరి దాచుకున్నానన్న మారుతి భార్య.. చాలా మంచి మనస్సంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన మారుతి( Director Maruthi ) ప్రస్తుతం ప్రభాస్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో ప్రభాస్, మారుతి ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మారుతి పర్సనల్ లైఫ్ గురించి అభిమానులకు పెద్దగా తెలియదు.వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది( Ala Modalaindi Show ) కార్యక్రమానికి మారుతి తన భార్య స్పందనతో కలిసి హాజరయ్యారు.

ఈ ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ బందర్ లో ఒక క్లబ్ ఉండేదని అక్కడ స్పందన అమ్మగారు చురుగ్గా ఉండేవారని అన్నారు.

స్పందనను( Spandana ) తొలిసారి చూసిన సమయంలో ఆమె ఎనిమిదో తరగతి చదువుతోందని మారుతి చెప్పుకొచ్చారు.

తనపై ప్రేమ ఉందని చెప్పలేదని అయితే ఇష్టం మాత్రం తెలిసేలా చేశానని మారుతి కామెంట్లు చేశారు.

స్పందన మాట్లాడుతూ చూడగానే మారుతి నచ్చారని నేను పదో తరగతికి వచ్చేసరికి ఆయన హైదరాబాద్ వెళ్లారని ఆయన ఫేస్, టాలెంట్ నచ్చాయని ఆమె అన్నారు.

"""/" / స్పందన ప్రతి విషయం డైరీలో రాస్తుందని ఆ డైరీలో విషయాలు ఇంట్లోకి తెలియడం వల్ల మా పెళ్లి జరిగిందని మారుతి తెలిపారు.

డైరీలో నాతో ఫోన్ మాట్లాడిన విషయాలు కూడా రాయడంతో ఇంట్లో తెలిసిందని మారుతి పేర్కొన్నారు.

స్పందన మాట్లాడుతూ ఈరోజుల్లో సినిమాలో హీరోయిన్ కు వాడిన డ్రెస్ లలో సగం డ్రెస్సులు నావేనని చెప్పుకొచ్చారు.

నేను శాకాహారి అని తను మాంసాహారి అని స్పందన పేర్కొన్నారు. """/" / నా బండికి నంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ వేయించానని ఒకరోజు నా బండిని వెనుక నుంచి ఎవరో ఢీ కొట్టడంతో ఆ నంబర్ ప్లేట్ ముక్కలైందని ఆ ముక్కలను ఏరుకొని దాచుకున్నానని ఆమె తెలిపారు.

మారుతి జేబులో చిన్న గంధం ముక్క ఉంటుందని ఆయన జ్యోతిష్యాన్ని నమ్ముతారని అంతకు మించి ఆయన రహస్యాలు ఏమీ లేవని అన్నారు.

ఈ ఇంటర్వ్యూను చూసిన వాళ్లు స్పందన మనస్సు మంచి మనస్సు అని చెబుతున్నారు.

వార్2 సినిమాలో తారక్ డ్యూయల్ రోల్.. ఆ రెండు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తారా?