మారుతి 'మంచి రోజులు వచ్చాయి' సెన్సార్ పూర్తి..!
TeluguStop.com
సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి మీడియం రేంజ్ సినిమాలతో పాటుగా స్మాల్ బడ్జెట్ సినిమాలు కూడా చేస్తూ ఉంటాడు.
ప్రతిరోజూ పండుగే సినిమా తర్వాత ఓ పక్క గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న మారుతి సంతోష్ శోభన్ డైరక్షన్ లో మంచి రోజులు వచ్చాయి సినిమా పూర్తి చేశాడు.
సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ ఫిక్స్ చేశారు.
దీపావళి కానుక్గా ఫ్యామిలీ మొత్తం చూసే ఎంటర్టైనర్ మూవీగా మంచి రోజులు వచ్చాయి సినిమా రాబోతుంది.
ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు బుధవారం పూర్తి చేసుకుంది.సెన్సార్ వారు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
మారుతి మార్క్ ఎంటర్టైనర్ సినిమాగా మంచి రోజులు వచ్చాయి రాబోతుంది.ఏక్ మిని కథ సినిమాతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.
సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆడియెన్స్ ను మెప్పించింది.మరి సినిమా కూడా అదే రేంజ్ లో అలరిస్తుందా లేదా అన్నది చూడాలి.
సంతోష్ శోభన్ మాత్రం మంచి రోజులు వచ్చాయి సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై డైరెక్టర్ ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్లు.. అలాంటి కామెంట్స్ చేస్తూ?