మెగాస్టార్‌కు నో చెప్పిన డైరెక్టర్
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక్క సినిమా చేయాలని చాలా మంది స్టార్ డైరెక్టర్లు కోరుతుంటారు.
అయితే చిరంజీవి మాత్రం చాలా సెలెక్టివ్‌గా తన సినిమాలను ఎంచుకుంటున్నాడు.ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల.కాగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడంతో ‘సూపర్ మచ్చి’ అనే సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.
అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కకముందే అటకెక్కేసింది.దీంతో తన అల్లుడికి ఓ మంచి హిట్ అవ్వాలని, మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ దర్శకులను కోరుతున్నారు.
ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్‌కు ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన మారుతిని చిరు ఓ సినిమా చేసి పెట్టాల్సిందిగా కోరాడట.
అయితే మారుతి మాత్రం చిరంజీవికి మర్యాదగా నో అని చెప్పాడట.తనకు వేరు కమిట్మెంట్స్ ఉన్నాయని మారుతి చెప్పి తప్పించుకున్నాడు.
దీంతో వేరే డైరెక్టర్ కోసం చిరు ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఛాట్‌జీపీటీపై సంచలన వ్యాఖ్యలు .. అమెరికాలో శవమై తేలిన భారత సంతతి టెక్కీ