అంగారకుడిని ఎరుపు రంగు గ్రహంని ఎందుకు పిలుస్తారో తెలుసా?

మనదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు.చిన్న విగ్రహం నుంచి పెద్ద పెద్ద దేవాలయాల వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో, పూజలు అందించడం మనలోని భక్తి భావానికి అద్దం పడుతుంది.

మనదేశంలో వెలసిన ప్రతి ఒక్క దేవాలయం వెనుక ఏదో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగి ఉంటుంది.

అలాంటి చారిత్రాత్మకమైన కథతో వెలసిన ఈ అంగారకుడి ఆలయం ఒకటి? దేశంలో ఎన్నో అంగారకుడి ఆలయాలున్నప్పటికీ, ఉజ్జయినిలో ఉన్న ఎరుపు రంగు అంగారకుడి దేవాలయం ఎంతో ప్రత్యేకం.

ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎరుపు రంగు గ్రహం అని అంగారకుడు అని ఎందుకంటారు? ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? అన్న విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంత ప్రత్యేకమైన ఎరుపురంగు అంగారకుడి దేవాలయం మహారాష్ట్రలోని ఉజ్జయినిలో వెలిసిన ఈ ఆలయాన్ని మంగళ నాథ్ ఆలయం అని కూడా పిలుస్తారు.

ఇక్కడి ప్రజలు ఈ దేవాలయం పైనే అంగారకుడు నివసిస్తుంటారు అని ఎంతో విశ్వసిస్తారు.

దేశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. """/"/ పురాణాల ప్రకారం, అంధకాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుని మెప్పించి, అంధకాసురుడు రక్తం నుంచి 100 మంది రాక్షసులు పుట్టేలా ఒక గొప్ప వరాన్ని పొందుతాడు.

అయితే ఈ వరం వల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందని భావించిన పరమేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడి తో పోరాటం సాగిస్తాడు.

వీరిరువురి మధ్య భయంకరమైన రణం సాగుతున్న నేపథ్యంలో ఆ పరమశివుడికి చెమటలు ధారలుగా ప్రవహిస్తుంది.

ఈ చెమట ఆ వేడికి అక్కడ ఉన్నటువంటి నేల రెండుగా చీలి అంగారక గ్రహం పుడుతుంది.

ఆ అంధకాసురుని వధించిన పరమేశ్వరుడు, కొత్తగా ఏర్పడిన అంగారకుడి రక్తపు చుక్కలు సేకరించడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూమి ఎరుపు రంగులో దర్శనమిస్తుంది.

ఇందుకు కారణంగా అంగారకుడి ని ఎరుపు రంగు గ్రహం అని కూడా పిలుస్తారు.

మంగళకరమైన దోషాలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల అటువంటి దోషాల నుంచి విముక్తి కలుగుతుంది.

అంగారక శాంతి పూజల కోసం దేశం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 20, శనివారం 2024