పెళ్లయి రెండేళ్లు అయినా శోభనం వద్దంటున్న భర్త.. చివరికి భార్య...

ఈ మధ్య కాలంలో కొందరు డబ్బు కోసం ఎంతటి ఘాతుకానికైనా పాల్పడుతున్నారు.కాగా ఓ వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాన్ని కప్పి పుచ్చుకుంటూ నిత్య పెళ్లి కొడుకు గా మారి అందినకాడికి కట్నం డబ్బులు, బంగారం దోచుకొని మహిళలను మోసం చేస్తున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో మహేష్ (పేరు మార్చాం) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

అయితే ఆ మధ్య మహేష్ కి తమ దగ్గరి బంధువులయినటువంటి ఓ యువతితో పెళ్లయింది.

కానీ పెళ్లయిన కొంతకాలానికి యువతితో మనస్పర్ధలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు.అయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తో 2018 సంవత్సరంలో మళ్లీ వివాహం చేశారు కుటుంబ పెద్దలు.

అయితే అప్పటి నుంచి మహేష్ శోభనం విషయంలో వెనుక అడుగు వేస్తూ ఈరోజు, రేపు అంటూ నెట్టుకొస్తున్నాడు ఇలా దాదాపుగా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.

అయితే మహేష్ భార్య కూడా చదువుకోవడంతో భర్త సమస్యని అర్థం చేసుకుంది.కానీ పిల్లల విషయంలో కుటుంబ సభ్యులు తొందర పెడుతుండడంతో మరోమారు శోభనం కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.

అయినప్పటికీ మహేష్ మాత్రం ససేమిరా ఒప్పుకోకపోవడంతో తన భార్య అసలు విషయం తెలుసుకునేందుకు ఆరా తీసింది.

అయితే ఇందులో తన భర్త గురించి అసలు నిజం తెలియడంతో ఒక్కసారిగా విస్తుపోయింది.

అయితే ఇంతకీ ఆ నిజం ఏమిటంటే మహేష్ నపుంసకుడని అంతేకాకుండా పలు "గే" డేటింగ్ వెబ్ సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసి ఉండడాన్ని గమనించింది.

దీంతో వెంటనే తన కుటుంబ సభ్యుల సహాయంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించి మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు మహేష్ పై మరియు అతడి కుటుంబ సభ్యుల పై ఫిర్యాదు నమోదు చేసింది.

పాన్ కార్డుకు సంబంధించి ఈ మార్పులు చేయండి.. విజయ్ సేతుపతి విజ్ఞప్తి వైరల్!