మొగుడు డబ్బు సంపాదించట్లేదని అతడి ఫ్రెండ్స్ ని లైన్ లో పెట్టిన భార్య.. చివరికి...

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు కోసం చేసేటువంటి పనులను చూస్తుంటే ఇంతటి ఘోరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అనే సందేహం కలగక మానదు.

కాగా తాజాగా ఓ వివాహిత తన భర్త డబ్బు సంపాదించటం లేదని ఏకంగా తన భర్త స్నేహితులతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని చివరికి కట్టుకున్న భర్తను దారుణంగా కడతేర్చిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని అహమదాబాద్ నగర పరిసర ప్రాంతంలో "రేఖ" అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.

అయితే రేఖ భర్త "జిగ్నేష్" బాగానే చదువుకున్నప్పటికీ బయటి పనులు పెద్దగా చేతకాక మరియు ఉద్యోగం రాకపోవడంతో ఇంటి పట్టునే ఉండేవాడు.

ఈ క్రమంలో జిగ్నేష్ మద్యానికి బానిసయ్యాడు.దాంతో డబ్బు సంపాదించక పోయినప్పటికీ ఇంట్లో ఉన్న డబ్బులు మద్యం సేవించడానికి ఉపయోగిస్తూ బానిసయ్యాడు.

దీంతో జిగ్నేష్ భార్య ఈ విషయంపై పలుమార్లు గొడవ పడినప్పటికీ జిగ్నేష్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

కాగా ఈ మధ్యకాలంలో జిగ్నేష్ స్నేహితులతో రేఖ కి పరిచయం ఏర్పడింది. """/"/ దీంతో అతికొద్ది సమయంలోనే రేఖ తన భర్త స్నేహితులకి దగ్గరై వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఇదే అదునుగా చేసుకున్న జిగ్నేష్ స్నేహితుడు జిగ్నేశ్ కి ఫుల్లుగా మద్యం త్రాగించి పడుకున్న తర్వాత తన భార్యతో కలిసి ఎంజాయ్ చేసే వాళ్ళు.

అంతేగాక పెళ్లికి ముందే రేఖకి మరో 19 సంవత్సరాలు కలిగిన యువకుడితో కూడా అక్రమ సంబంధం ఉండేది.

కాగా తాజాగా రేఖ వివాహేతర సంబంధం గురించి జిగ్నేష్ కి తెలియడంతో పలుమార్లు గొడవ పడ్డారు.

దీంతో రేఖ తన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.ఈ ప్లాన్ లో భాగంగా తన ఇద్దరి ప్రియుళ్ళతో కలిసి జిగ్నేష్ ని దారుణంగా హత్య చేయించింది.

అనంతరం ఏమి ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.కానీ వాంగ్మూలం ఇచ్చే సమయంలో రేఖపై అనుమానం కలగడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయట పడింది.

భారతీయ మహిళకి అమెరికాలో అత్యున్నత పదవి .. వెలుగులోకి మోడీ వ్యతిరేక చర్యలు