వదిన తో ప్రేమలో పడిన మరిది... చివరికి ఇద్దరూ కలిసి...

ఈ మధ్య కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి వావి వరసలు మరియు వయస్సు భేదాలతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

కాగా తాజాగా ఓ యువకుడు తన అన్న భార్య అయిన వదినతో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఇంటి నుంచి పారిపోయి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని నలంద పరిసర ప్రాంతంలో రేఖ ( పేరు మార్చాం ) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.

అయితే రేఖ భర్త కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరికే ఎటువంటి చిన్న చిన్న పనులను చేస్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో ఉదయం సమయంలో భర్త బయటకు వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు.

దీంతో రేఖ కొంతమేర ఒంటరిగా ఫీల్ అయ్యేది.ఈ క్రమంలో రేఖ కి వరుసకు మరిది అయ్యే "మాజేష్" అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

దీంతో మాజేష్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.ఈ క్రమంలో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

దీంతో రేఖ భర్త ఇంట్లో లేనప్పుడు మాజేష్ తో జల్సా చేసేది.చివరికి ఈ విషయం కాస్తా ఈ నోటా ఆ నోటా పాకుతూ రేఖ భర్తకి తెలిసింది.

దీంతో రేఖ భర్త మాజేష్ ని పిలిపించి మందలించాడు.అంతేకాకుండా మరోమారు తన ఇంటి దరిదాల్లో కనబడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

దాంతో కొన్ని రోజుల పాటు రేఖ మరియు మాజేష్ దూరంగా ఉన్నారు.దీంతో తీవ్ర ఎడబాటుకు లోనైన ఇద్దరు 2 నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వేరు కాపురం పెట్టారు.

మళ్లీ ఇటీవలే సొంత గ్రామానికి చేరుకుని తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అందుకు పెద్దల అంగీకారం కావాలని అడిగారు.

దాంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి ఇరువురను మందలించారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రేఖ మరియు ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశారు.

అయితే ఇందులో రేఖ ప్రియుడు మృతి చెందగా రేఖ మాత్రం ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

తాజ్ మహల్ ప్యాలెస్‌లో టీ తాగిన మధ్యతరగతి వ్యక్తి.. ఆ టీ ధర తెలిస్తే..?