కొంప ముంచిన పేస్ బుక్ పరిచయం!
TeluguStop.com
పేస్ బుక్ పరిచయాలు, ప్రేమలు ఎన్ని అనర్దాలకి దారితీస్తాయో సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం.
కాని యువత, ఎక్కువగా పేస్ బుక్ పరిచయాలకి ఆసక్తి చూపిస్తూ, అనుకోకుండా ట్రాప్ లో పడి అడ్డంగా బుక్ అయిపోతున్నారు.
చివరికి బంధాలని, జీవితాలని నాశనం చేసుకుంటున్నారు.ఇప్పుడు అలాంటి సంఘటన గుంటూరు జిల్లాలో పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే వివాహం అయ్యి రెండేళ్ళ కొడుకు ఉన్న ఓ యువతీ పేస్ బుక్ లో అనుకోకుండా వచ్చిన మెసేజ్ తో రాజేష్ అనే వ్యక్తితో చాటింగ్ మొదలెట్టింది.
అతను తరువాత ఆమెతో మరింత పరిచయం పెరిగింది.రాజేష్ కి ఆమె ప్రైవేట్ ఫోటోలని ఓ సారి షేర్ చేసింది.
దీంతో అప్పటి నుంచి ఆమెపై బెదిరింపులకి పాల్పడుతూ లొంగదీసుకున్నాడు.తరువాత పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో భర్తని, బిడ్దని వదిలేసి అతనితో వెళ్ళిపోయింది.
ఇద్దరు కొంతకాలంగా మంగళగిరిలో అద్దెకి ఉంటున్నారు.ఈ నేపధ్యంలో ఆమె దగ్గర నగదు, నగలు అన్ని మెల్లగా తన సొంతం చేసుకున్న రాజేష్ ఆమెని గృహ నిర్బంధం చేసి బయటకి వెళ్ళిపోయేవాడు.
కొద్ది రోజుల క్రితం ఆమెని వివాహం చేసుకున్న తర్వాత రాజేష్ మళ్ళీ కొత్త యువతులని ట్రాప్ చేయడం మొదలెట్టాడు.
దీనిపై ఆమె నిలదీస్తే బెదిరించి చంపేయడమో, వ్యభిచారం కూపంకి అమ్మేయడమో చేస్తా అంటూ భయపెట్టాడు.
అతని బెదిరింపులు రోజు రోజుకి పెరిగిపోవడంతో అతని నుంచి తప్పించుకొని వచ్చేసిన ఆమె పెదకాకాని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది.