ఫేస్ బుక్ ప్రేమ మోజులో పడి భర్తను వదిలేసి ప్రియుడు దగ్గరికి వెళ్ళింది…చివరికి

ప్రస్తుత కాలంలో కొందరు వివాహిత మహిళలు సోషల్ మీడియాలో ఎక్కువ కాలం గడుపుతూ  కట్టుకున్న బంధాలను మరిచి ప్రవర్తిస్తూ తమ కాపురాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

తాజాగా ఓ వివాహిత ఫేస్ బుక్ ప్రేమలో పడి కట్టుకున్న భర్తను సైతం వదిలి పెట్టి తన ప్రియుడి దగ్గరికి వెళ్లి చివరికి అతడు కూడా కాదనడంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి ధర్మవరం పట్టణంలో ఓ వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.

అయితే ఈమె కాలక్షేపం కోసం సోషల్ మీడియా మాధ్యమాలయినటువంటి ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్ వంటివి వాటితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేది.

ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ పెళ్లయిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధం వైపు అడుగులేసింది.

దీంతో వివాహిత ఏకంగా కట్టుకున్న భర్తను వదిలి పెట్టి తన కొడుకుతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఏకంగా ప్రియుడుతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా వివాహిత తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది.అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి వ్యక్తి భార్య  తన భర్త వివాహేతర సంబంధం విషయంలో కలుగజేసుకుని తన భర్తను వదిలి పెట్టాలని లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

అయితే పెళ్లి విషయంలో పలుమార్లు తన ప్రియుడికి చెప్పినప్పటికీ అతడి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చివరికి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

ఈ విషయం గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.

ఇప్పుడు ప్రస్తుతం వివాహిత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.

బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!